టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత కనపడకుండా  పోయిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అగ్ర హీరోలతో వరుసగా సినిమాలు చేసిన ఆమె ఏమైందో ఏమో తెలియదు గాని సినిమాలకు బాగా దూరం జరిగింది. మరి ఆమెను వద్దన్నారో ఆమె వద్దని చెప్పిందో తెలియదు గాని ఆమె మాత్రం పక్కకు తప్పుకుంది అనే ప్రచారం మాత్రం బాగా జరిగింది. ఆమె ప్రస్తుతం ఒక్క అవకాశం వచ్చినా సరే చాలు అనుకునే పరిస్థితిలో ఉంది. ఆమెను ఎవరూ కూడా తీసుకోవడం లేదు అనేది కూడా మనకు ఎక్కువగా వినపడుతుంది. 

 

ప్రస్తుతం ఆమె బాలీవుడ్ సినిమాల్లో ఒక్క అవకాశం వచ్చి నా సరే చాలు అనుకునే విధంగా ఉంది. బాలీవుడ్ లో ఆమెను పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదు. ఇక తమిళ సినిమాల్లో ఆమెను సూట్ అవ్వదు అనేది అందరికి తెలిసిందే. ఇప్పుడు తెలుగులో తనకు ఆదరణ ఉంది అనుకుని ఇక్కడసినిమాలు చేయడానికి ఆమె తీవ్రంగా కష్టాలు పడుతుంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మరి అది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని... ఆమె మాత్రం ఇప్పుడు తెలుగులో సినిమాలు చేయడానికి తీవ్రంగా కష్టపడుతుంది. 

 

అగ్ర హీరోల సినిమాల్లో ఒక్క అవకాశం వచ్చినా చాలు అనుకునే పరిస్థితిలో ఆమె ఉందని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మరి ఆమె ఇప్పుడు అయినా సరే బిజీ అవుతుందా లేదా అనేది ఎవరికి తెలియదు. కాని ఆమెకు మాత్రం కాస్త పొగరు ఉందని అందుకునే ఆమెను కొందరు పక్కన పెట్టారు అనే టాక్ కూడా ఎక్కువగానే వినపడుతుంది. చిన్న చిన్న సినిమాల్లో కూడా ఆమెకు అవకాశాలు వచ్చే అవకాశం లేదని అర్ధమవుతుంది. ఆమె పైకి చెప్పలేని విధంగా బాధ పడుతుంది అని అంటున్నారు. మరి ఏ అవకాశం వస్తుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: