సమంతా - నాగ చైతన్య పెళ్లి తర్వాత టాలీవుడ్ లో పెద్దగా ప్రేమ వ్యవహారాలు బయటకు వచ్చే పరిస్థితి కనపడటం లేదు. సుధీర్ఘ కాలం పాటు ప్రేమించి ప్రేమించి ఎన్నో అంచ‌నాలు, ఆశ‌ల మ‌ధ్య ఈ జంట పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రి పెళ్లి సౌత్ ఇండియాలోనే పెద్ద స‌చల‌నం. సౌత్ ఇండియాలో పెద్ద స్టార్ హీరోయిన్ గా ఉన్న స‌మంత చైతును పెళ్లి చేసుకుని తెలుగు ఇండ‌స్ట్రీలో పెద్ద కుటుంబం అయిన అక్కినేని ఇంటి కోడ‌లు అవ్వ‌డం పెద్ద క్రేజీ న్యూస్ అయ్యింది. 

 

ఇక వీరి పెళ్లి త‌ర్వాత సినిమా ఇండ‌స్ట్రీలో ఎవరు కూడా ప్రేమ వ్యవహారాల మీద దృష్టి పెట్టడం లేదు. ఎక్కువగా హీరోలు అందరూ కూడా కమర్షియల్ సినిమాలు మంచి కథలతో సినిమాలు చేయడం మీద ఫోకస్ చేశారు. దాదాపు అందరు హీరోలు అదే పని మీద ఉన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఒక వార్త బయటకు వచ్చింది.  అది ఏంటీ అనేది ఒక్కసారి చూస్తే ఒక టాలీవుడ్ యువ జంట ఇప్పుడు ప్రేమలో పడింది అని సమాచారం. అయితే ఒక యాంకర్ కి హీరోకి మధ్య ప్రేమ నడుస్తుంది అని ప్రచారం జరుగుతోంది. 

 

సదరు హీరో గారు ఈ మధ్య కాలంలో సినిమాలకు దాదాపుగా దూరంగా ఉన్నారు. మరి ఏమైందో ఏమో ఆయన ప్రేమలో పడ్డారు. ఆ యాంకర్ ఎవ‌ర‌న్న‌ది బ‌య‌ట‌కు పొక్క‌నీయ‌క పోయినా .. స‌ద‌రు హీరో మాత్రం  ఆమెను కలిసాడు అని... ఆమె తో పాటు ఢిల్లీ కూడా వెళ్ళాడు అని సమాచారం. వారి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు తెలుసు అని అంటున్నారు. ఇరు కుటుంబాలు అంతా మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకునే అవకాశం ఉందని సమాచారం. దీనిపై త్వరలోనే స్పష్టత కూడా వచ్చే సూచనలు కనపడుతున్నాయి. మరి ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అనేది మాత్రం స్పష్టత లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: