కరోనా దేశాన్ని కమ్మేసి రెండు నెలలు కావస్తోంది. లాక్ డౌన్ కారణంగా వ్యవస్థలన్నీ నిస్తేజమైపోయాయి. ఇందులో ప్రజలకు వినోదాన్ని అందించే సినీ పరిశ్రమ కూడా ఉంది. టాలీవుడ్ లో కూడా షూటింగులు, రిలీజులు ఆగిపోయి రోజువారీ కార్మికులు ఇబ్బందులు పడ్డారు. పరిస్థితిని గమనించిన చిరంజీవి సీసీసీ మనకోసం అనే సంస్థను ఏర్పాటు చేసి కార్మికులకు నిత్యావసరాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు టాలీవుడ్ లో ఎంతోమంది ప్రముఖులు విరివిగా విరాళాలు అందించారు. ప్రస్తుతం హీరో సుధీర్ బాబు కూడా సీసీసీకి తనవంతు సాయం అందించాడు.

 

 

మే 11న తన పుట్టినరోజు సందర్భంగా ఇండస్ట్రీలోని కార్మికుల సంక్షేమం కోసం ముందుకొచ్చాడు. లాక్ డౌన్ పరిస్థితుల్లో కార్మికులను ఆదుకుంటున్న సీసీసీ మనకోసం చారిటీకి తన వంతుగా లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించాడు. ఇప్పటికే ఎంతోమంది దాతల సహకారంతో సీసీసీ నుంచి నిర్విరామంగా నిత్యావసరాలు అందుతున్నాయి. భరద్వాజ్, శంకర్, మెహర్ రమేశ్.. తో సహా పలువురి సాయంతో చిరంజీవి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతోంది. నాణ్యమైన సరుకులనే అందించడంతో సీసీసీ చారిటీకి మంచి పేరు కూడా వచ్చింది. ఇప్పుడు ఈ చారిటీకి సుధీర్ బాబు కూడా తన వంతుగా సాయం చేయడం శుభపరిణామం.

 

 

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా స్వయంగానే సినిమాల్లో ప్రయత్నించాడు. సినిమాల్లోకి వెళ్లాలన్న తపన మాత్రమే సుధీర్ కు ఉంది. సినిమాలు చేస్తూండగా కృష్ణ అల్లుడిగా, మహేశ్ బావగా గుర్తింపు వచ్చింది. నాగ చైతన్య, సమంత కాంబినేషన్లో వచ్చిన ఏ మాయ చేశావే సినిమాలో సమంత అన్నయ్యగా చేసిన పాత్రతో లైమ్ లైట్ లోకి వచ్చాడు. ప్రస్తుతం నాని హీరోగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన వి సినిమాలో విలన్ గా చేశాడు. ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: