టాలీవుడ్ లో ఒకే రకం సినిమాలు వస్తున్నాయి అన్న మాట ఉంది. ఎప్పటికీ స్టీరియో టైప్ మూవీస్ తీస్తూ అవే జనాలకు చూడమంటున్నారు. దాంతో మంచి కధలు ఒకటీ అరా వస్తున్నాయి తప్ప పెద్దగా రావడంలేదు. ఇక హీరోలు కూడా ఎవరికి వారు పరిధులు పెట్టుకుని వ్యవహరించడం వల్ల కొత్తదనంతో కూడిన సినిమాలు రావడంలేదు.

 

అయితే కోలీవుడ్ చూసినా బాలీవుడ్ చూసినా టాప్ హీరోలంతా కలసి నటిస్తారు. అక్కడ పాత్రల గురించి అసలు పట్టించుకోరు. కధ నచ్చితే చాలు చేసేస్తారు. మన హీరోలు మాత్రం స్క్రీన్ స్పేస్ ఎంత, మనకు ఎంత అవకాశం ఉంది. పాత్ర ఎలివేట్ అవుతుందా లేదా. హీరోయిన్ ఎవరు, ఇలా అన్నీ పట్టించుకుంటారు. పైగా ఫ్యాన్స్ ను ముందుకు తెచ్చి సరైన పాత్ర లేకపోతే వారు చూడరు అని తప్పు తోసేస్తారు.

 

నిజానికి ఫ్యాన్స్ కి అలాంటిది ఉండదు, కొంతమంది అలా ఉన్నా సినిమా ద్వారా వారికి నచ్చ చెప్పవచ్చు. మంచి పాత్ర చేసి వారిని ఆనందింపచేయవ‌చ్చు. కానీ జరుగుతున్నది వేరుగా ఉంది. టాలీవుడ్లో చాలా మంది హీరోలు బయట కలవడానికే ఇబ్బంది పడుతూంటారు. ఇక స్క్రీన్ ని పంచుకుని మల్టీ స్టారర్ మూవీస్ చేయడం అంటే అది అసాధ్యమే అంటారు.

 

మంచి కధ ఉంటే చేస్తామని చెప్పి తప్పించుకున్నవారే ఎక్కువ. నిజానికి టాలీవుడ్లో టాప్ స్టార్లు కలిస్తే అద్భుతమైన కధలు వస్తాయి. పైగా పెద్ద హిట్లు కూడా అవుతాయి. బాలక్రిష్ణ చిరంజీవి,బాలక్రిష్ణ  నాగార్జున, నాగార్జున వెంకటేష్, నాగార్జున చిరంజీవి. ఇలాంటి కాంబినేషన్లు ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తారు. అలాగే యంగ్ హీరోల్లో కూడా మంచి కాంబినేషన్లు ఉన్నాయి.

 

అల్లు అర్జున్ రాం చరణ్. ప్రభాస్, మహేష్ బాబు. పవన్ మహేష్ బాబు, ప్రభాస్ పవన్ కళ్యాణ్ ఇలా కాంబోలను కలిపితే బంపర్ హిట్లు వస్తాయి. ఆ దిశగా మన హీరోలు కూడా ఆలోచిస్తే మంచి సినిమాలు , మంచి కధలు వస్తాయి. మరి ఎపుడైనా చేస్తారా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: