మొట్టమొదటిగా నీడ సినిమా ద్వారా బాలనటుడిగా తెలుగు సినీ తెరపై ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు, ఆపై చిన్నతనంలోనే పలు సినిమాల్లో నటించి బాలనటుడిగా మంచి పేరు దక్కించుకున్నారు. అనంతరం కొన్నాళ్ల విరామం తర్వాత 1999లో రాజకుమారుడు సినిమా తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చేసిన మహేష్ బాబు, ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ కొట్టడంతో పాటు ఎన్నో గొప్ప రికార్డులను సొంతం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత రెండో సినిమాగా వచ్చిన యువరాజు లో నాలుగేళ్ల బిడ్డకు తండ్రిగా నటించిన మహేష్ బాబు, ఒక రకంగా పెద్ద సాహసమే చేశాడని చెప్పాలి. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో రూపొందిన ఆ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 

 

ఇటీవల ఆ సినిమా సక్సెస్ ఫుల్ గా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా యువరాజు సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఏప్రిల్ 14, 2000వ సంవత్సరంలో రిలీజైన ఈ సినిమా రిలీజ్ రోజునే మణిరత్నం దర్శకత్వంలో మాధవన్, శాలిని కలిసి నటించిన సఖి రిలీజ్ అయి పెద్ద హిట్ కొట్టింది. ఇక అంతకుముందు సరిగ్గా తొమ్మిది రోజుల క్రితం యువ సామ్రాట్ నాగార్జున నటించిన నువ్వు వస్తావని సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ టాక్ తో ముందుకు సాగుతోంది. అలానే ఈ సినిమా రిలీజ్ తర్వాత సరిగ్గా ఏడో రోజున, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ ల తొలి కాంబినేషన్లో వచ్చిన బద్రి కూడా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని దూసుకెళ్లింది. 

 

ఈ విధంగా ఒకేసారి మూడు సూపర్ హిట్ సినిమాల మధ్యలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన యువరాజ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం మంచి సక్సెస్ అందుకోవటం జరిగిపోయింది. ఒకరకంగా హీరో మహేష్ బాబు, దర్శకుడిగా తన పై నిలబెట్టిన నమ్మకమే ఈ సినిమా సక్సెస్ కి కారణం అని, అందుకే పక్కన మూడు సూపర్ హిట్ సినిమాలు ఉన్నప్పటికీ, అలానే రెండో సినిమా ద్వారానే ఒక బిడ్డకు తండ్రిగా నటిస్తున్నప్పటికీ కూడా తనపై, సినిమా కథపై ఉన్న నమ్మకంతో అప్పట్లో ఆ సినిమా రిలీజ్ చేయండి పర్లేదని మహేష్ అన్నారని దర్శకుడు వైవిఎస్ చౌదరి వెల్లడించారు. నిజంగా అది పెద్ద సాహసమేనని, ఒకరకంగా అటువంటి డేరింగ్ ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నుండి మహేష్ కు వచ్చిందని పలువురు ప్రేక్షకులు, అభిమానులు అంటున్నారు.....!!!

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: