దాదాపుగా రెండేళ్ల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్. అంతకముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో తన కెరీర్ 25వ సినిమాగా వచ్చిన అజ్ఞాతవాసిలో నటించిన పవన్, ఆ సినిమా తరువాత తన రాజకీయ జీవితంలో కొంత బిజీ అయ్యారు. ఇక ప్రస్తుతం వకీల్ సాబ్ లో ఒక పవర్ఫుల్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు పవన్. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, అంజలి, నివేత థామస్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు సంగీత దర్శకుడు తమన్ కంపోజ్ చేసిన మగువా మగువా అనే పల్లవితో సాగే పాట ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి శ్రోతల నుండి విశేషమైన స్పందన రాబట్టడం జరిగింది. 

 

వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల అమితాబ్ బచ్చన్ హీరోగా బాలీవుడ్ లో రిలీజ్ అయిన పింక్ సినిమాకు అధికారిక రీమేక్ గా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ లో, మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఎన్నో రకాల మార్పులు చేర్పులు చేశారట. కథ పరంగా ఒక కోర్టు డ్రామాగా సాగనున్న ఈ సినిమాలో మొత్తం రెండు ఫైట్స్ ఉంటాయని, కాగా అందులో నైట్ ఎఫెక్ట్ లో వచ్చే ఫైట్ ఈ సినిమాకి పెద్ద హైలైట్ అని అంటున్నారు. సినిమాలో పవన్ కు ప్రకాష్ రాజ్ కు మధ్య వచ్చే కోర్ట్ సీన్స్ తో పాటు పవన్ పవర్ఫుల్ డైలాగ్స్ ఎంతో బాగుంటాయట. 

 

కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా పలురకాల కమర్షియల్ హంగులతో దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట. అలానే తమన్ స్వరపరిచిన పాటలన్నీ కూడా అద్భుతంగా వచ్చాయని, మొత్తంగా ఈ విధమైన పలురకాల హైలైట్స్ తో వకీల్ సాబ్ తెరకెక్కుతోందని అంటున్నారు. దీనిని బట్టి చూస్తుంటే పవన్ కంబ్యాక్ సినిమాగా రానున్న ఈ వకీల్ సాబ్, తప్పకుండా మంచి హిట్ కొట్టి ఆయన అభిమానులను అలరిస్తుంది అని అంటున్నారు సినీ విశ్లేషకులు/ ఒకవేళ అదే కనక ఇది నిజమైతే పవన్ ఫ్యాన్స్ కి ఇక పండగే అని చెప్పవచ్చు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: