టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మొన్న జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా, ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకొని మంచి హిట్ కొట్టి కొట్టడం జరిగింది. ఇక అంతకుముందు భరత్ అనే నేను, మహర్షి సినిమాల ద్వారా రెండు విజయాలు అందుకున్న మహేష్ బాబు, ఈ సరిలేరు సినిమా ద్వారా మరొక విజయంతో మొత్తంగా మూడు హిట్స్ కొట్టి హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నారు. 

IHG

ఇక అతి త్వరలో పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా చేయనున్న మహేష్ బాబు, కొద్ది రోజుల అనంతరం దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నారు. దానికి సంబంధించి ఇటీవల అధికారిక ప్రకటన కూడా రావడం జరిగింది. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి రౌద్రం రణం రుధిరం సినిమా తీస్తున్న రాజమౌళి, కొద్దిరోజులుగా కరోనా కారణంగా మన దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న కారణంగా, అది ముగిసిన అనంతరం, ఆర్ఆర్ఆర్ తాలూకు మిగతా షూటింగ్ వేగవంతంగా పూర్తి చేసి వీలైనంత త్వరగా అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చూస్తున్నారట. 

IHG's film with <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=GEETHA GOVINDAM' target='_blank' title='geetha govindam-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>geetha govindam</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=DIRECTOR' target='_blank' title='director-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>director</a> to have Shraddha ...

ఆపై కొంత గ్యాప్ తర్వాత మహేష్ సినిమాని ప్రారంభించనున్న రాజమౌళి, ఇప్పటికే ఈ సినిమా కోసం హీరోయిన్ గా ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ సరసన సాహో సినిమాలో నటించిన శ్రద్ధాకపూర్ ను తీసుకునేందుకు సిద్దమైనట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. వాస్తవానికి మహేష్ తో చేయబోయే సినిమాకి కథ ఇంకా సిద్ధం కానప్పటికీ, రాజమౌళి అనుకుంటున్న విజన్ ప్రకారం, మహేష్ తో చేయబోయే సినిమాని కూడా పాన్ ఇండియా రేంజ్ లో తీస్తారు కాబట్టి, అన్ని వర్గాల, ప్రాంతాల ప్రేక్షకులను ఆ సినిమా చేరువ చేసేందుకు వీలుగా బాలీవుడ్ నటి శ్రద్ధా అయితేనే మహేష్ కు సరిగ్గా సరిపోతుందని ఆయన యోచిస్తున్నారట. మరి ప్రస్తుతం విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు గాని, ఒకవేళ ఇదే గనుక నిజమైతే మాత్రం మహేష్ ఫ్యాన్స్ కి ఇది పెద్ద పండుగ వార్తే అని చెప్పాలి.....!!

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: