నాచురల్ స్టార్ నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన సినిమా జెంటిల్ మెన్. ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్ లో కనిపించాడు. గౌతమ్, జై రెండు పాత్రల్లో నాని నటన చాలా బాగుంటుంది. ఇంద్రగంటి ఈ సినిమాను పూర్తిగా సస్పెన్స్ థ్రిల్లర్ లా తీయకుండా కమర్షియల్ గా తెరకెక్కించారు. సినిమాలో ఐశ్వర్య పాత్రలో సురభి.. కేథరిన్ పాత్రలో నివేదా థామస్ నటించారు. 

 

కేథరిన్ ను ప్రేమించిన జై సడెన్ గా కనిపించకుండాపోతాడు.. అలాంటి టైం లో కేథరిన్ కు ఐశ్వర్య పరిచయం అవుతుంది. తను పెళ్లి చేసుకోబోయే జైని పరిచయం చేస్తుంది. జై కూడా గౌతమ్ లా ఉండటం కేథరిన్ కు డౌట్ వస్తుంది. జై, గౌతమ్ ఇద్దరా ఒక్కడే ఇద్దరిగా నటించాడా అన్నది అటు ఆడియెన్స్ లో కూడా క్యూరియాసిటీ ఏర్పడింది. ఫైనల్ గా కేథరిన్ సీక్రెట్ ఆపరేషన్ లో జై గా కనిపించేది గౌతమ్ అని రివీల్ అవుతుంది.

 

ఇంద్రగంటి చాలా క్లవర్ గా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. సినిమా అంతా చాలా ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. నాని జెండాపై కపిరాజు సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించాడు. మళ్ళీ ఆ తర్వాత జెంటిల్మెన్ లోనే రెండు పాత్రల్లో మెప్పించాడు. ఇక ఆ తర్వాత కృష్ణార్జున యుద్ధం కూడా రెండు పాత్రల్లో అలరించాడు. తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో నాని జెంటిల్ మెన్ కూడా ఒకటని చెప్పొచ్చు. అయితే కేవలం థ్రిల్లర్ లా కాకుండా సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించారు ఇంద్రగంటి మొహానకృష్ణ. ఇప్పుడు మళ్ళీ ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో v మూవీ చేశాడు నాని. ఈ సినిమాలో నాని విలన్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా కూడా సస్పెన్స్ థ్రిల్లర్ గానే వస్తుందని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: