నాని, సుధీర్ బాబు కలిసి నటించిన క్రేజీ మల్టీస్టారర్ మూవీ V. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. సినిమాలో నాని విలన్ గా కనిపించనున్నాడు. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా చేశాడు. లాక్ డౌన్ వల్ల రిలీజ్ వాయిదా పడిన ఈ సినిమా డిజిటల్ రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి. v ఓటిటి రిలీజ్ పై సినిమాలో ఒక హీరోగా నటించిన సుధీర్ బాబు క్లారిటీ ఇచ్చారు. 

 

సినిమాకు ఓటిటి ఆఫర్స్ చాలా వస్తున్నాయి.  సినిమా అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. మేము సినిమా మీద పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్నామని చెప్పాడు సుధీర్ బాబు. అయితే సినిమాను సగం ఓటిటిలో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారట. ఫస్ట్ హాఫ్ చూసి సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేసే లా v సినిమా సగం ఓటిటి రిలీజ్ ఉంటుందని అంటున్నారు. అయితే ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. 

 

మొన్నామధ్య v డైరెక్టర్ మా సినిమా థియేటర్ లో చూసే సినిమా.. టీవీ, సెల్ ఫోన్ లో చూసేది కాదని అన్నారు. అయితే ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నట్టు టాక్. అదే జరిగితే నాని v సరికొత్త సెన్సేషన్ గా మారడం ఖాయం. v లో నివేదా థామస్, అదితి రావు హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా ఓటిటి రిలీజ్ అయినా సినిమా కు ఉన్న క్రేజ్ దృష్ట్యా సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు. నాని ఫుల్ లెంగ్త్ నెగటివ్ రోల్ చేసిన ఈ సినిమా గురించి పూర్తి డిటైల్స్ త్వరలో తెలుస్తాయి. నాని సినిమాతో పాటుగా మరికొన్ని సినిమాలు డిజిటల్ రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. రామ్ రెడ్, అనుష్క నిశ్శబ్దం కూడా డిజిటల్ రిలీజ్ డిస్కషన్స్ నడుస్తున్నాయట. 

మరింత సమాచారం తెలుసుకోండి: