థ్రిల్లర్ సినిమాలు తెరకెక్కించటంతో దర్శకుడు వంశీ స్టైలే వేరు. ఆయన రూపొందించే సినిమాల్లో అదిరిపోయే కామెడీతో పాటు కట్టి పడేసే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ కూడా పుష్కలంగా ఉంటాయి. అలాంటి ఓ అరుదైన థ్రిల్లర్‌ మూవీనే అన్వేషణ. 1985లో రిలీజ్‌ అయిన ఈ సినిమాలో కార్తీక్‌ హీరోగా నటించగా భానుప్రియ అతని జోడిగా నటించింది. సత్యనారాయణ, రాళ్లపల్లి, శరత్‌ బాబు, శుభలేఖ సుధాకర్‌, మల్లిఖార్జున రావు, వై విజయ కీలక పాత్రల్లో నటించారు. సినిమాకు వంశీ కథా కథనాలు ఒక ఎత్తైయితే ఇళయరాజా సంగీతం, ఎమ్‌ వీ రఘు సినిమాటోగ్రఫి మరో ఎత్తు. టెక్నికల్‌గా కూడా అద్భుతం అనిపించిన ఈ సినిమా అప్పట్లో సూపర్‌ హిట్ అనిపించుకుంది.

 

కథ విషయానికి వస్తే పక్షుల మీద పుస్తకం రాయాలని భావిస్తాడు రావు (సత్య నారాయణ) అందుకోసం రాళ్లపల్లితోనే కలిసి అడువుల్లోనే ఉంటు పక్షుల శబ్దాలను పరిశీలిస్తుంటాడు. తను అనుకున్న పుస్తకం రాసేందుకు హేమ (భానుప్రియ)ను కూడా అడవికి పిలిపిస్తారు. అయితే అదే సమయంలో అడవిలో ఓ పులి చేతిలో వరుసగా ప్రజలు చనిపోతుంటారు. ఈ వరుస హత్యల మిస్టరీని చేదించేందుకు హీరో అమర్‌ (కార్తీక్‌), సత్యనారాయణ దగ్గర మేనేజర్‌గా మారు వేశంలో అడవికి వస్తాడు.

 

అసలు అడవిలో జరుగుతున్న హత్యలకు కారణంగా ఏంటి? నిజంగా పులే ఈ హత్యలు చేస్తుందా..? లేక ఎవరైనా వ్యక్తులు హత్య  చేసి పులి చేసినట్టుగా చిత్రీకరిస్తున్నారా..? ఈ అంశాలనే థ్రిల్లింగ్‌ గా రూపొందించాడు దర్శకుడు వంశీ. చివరకు అసలు హంతకుడు ఎవరన్న విషయంతో కథ ముగుస్తుంది. ఆ అంశాన్ని కూడా ఎవరు ఊహించని ట్విస్ట్‌తో ముగించాడు దర్శకుడు. అందుకే తెలుగులో వచ్చిన ది బెస్ట్ థ్రిల్లర్స్‌లో ఒకటిగా నిలిచిపోయింది అన్వేషణ. కేవలం 15 లక్షల రూపాయల బడ్జెట్‌లో ఈ సినిమాను నిర్మించారు. అయితే అప్పట్లో పెట్టిన పెట్టుబడికి ఎన్నో రెట్లు లాభాలు తెచ్చిపెట్టింది ఈ మూవీ.

మరింత సమాచారం తెలుసుకోండి: