టాలీవుడ్ లో అనుష్క కు ఎంత పేరు వచ్చింది అనేది పక్కన పెడితే ఆమె చేసిన సినిమాలు మాత్రం కొన్ని ప్రేక్షకులకు అదే విధంగా నచ్చాయి అనేది వాస్తవం. టాలీవుడ్ లో అనుష్క రేంజ్ పెంచిన సినిమాలు చాలా నే ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకునే సినిమా ఏదైనా ఉందీ అంటే... అరుంధతి. ఆమె కెరీర్ లో ఆ సినిమా ముందు ఆ సినిమా తర్వాత అనే విధంగా ఉండేది అని అందరికి తెలిసిన విషయమే. ఆ సినిమా తర్వాత ఆమె వెనక్కు తిరిగి చూసుకునే సందర్భం అనేది ఎప్పుడు రాలేదు అనేది వాస్తవం. టాలీవుడ్ లో అక్కడి నుంచి ఆమెకు డిమాండ్ కూడా బాగా పెరిగింది. 

 

అది పక్కన పెడితే టాలీవుడ్ లో ఆ సినిమా కొన్ని కొన్ని విధాలుగా సంచలనమే. ఇక ఆ సినిమాలో ఉండే కొన్ని కొన్ని సన్నివేశాలు ఎప్పుడు ఎం జరుగుతుందా అనే విధంగా ఉంటాయి అనేది వాస్తవం. ప్రతీ సన్నివేశం కూడా ప్రేక్షకులకు ఆసక్తిని పెంచిందే. ఆ సన్నివేశాల్లో ఆమె నటన కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ముఖ్యంగా సోనూ సూద్ ని చంపే విధానం. అతని నుంచి ఆమె బయటపడాలి అనుకునే విధానం అన్నీ కూడా ప్రేక్షకులకు అలా గుర్తున్నాయి. ఆ సినిమా ముందు ఆ సినిమా తర్వాత అనే విధంగా టాలీవుడ్ లో కూడా కొన్ని కొన్ని విషయాల గురించి ప్రేక్షకులు పదే పదే మాట్లాడుకున్నారు. 

 

ఆ సినిమాలో సోనూ సూద్ నటన కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఆ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో అతను అనుష్క కు పోటీ ఇచ్చాడు. దర్శకుడి ఆలోచన కు తగిన విధంగా అతను నటించాడు. ఆ కోట లో ఉండే సన్నివేశాలు ఆ తర్వాత కుటుంబ సభ్యులు కొందరు చనిపోవడం అన్నీ కూడా సస్పెన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: