మహేష్ బాబుతో రొమాన్స్ చెయ్యబోయే హీరోయిన్ ఎక్కడుందో , ఎప్పుడు ఫైనల్ అవుతుందో అని బాగా సెర్చ్ చేస్తున్నారు . లాక్ డౌన్ తర్వా స్టార్ట్ అయ్యే సినిమాలో మహేష్ బాబు ఇమేజ్ కి తగినట్టు అన్ని హంగులు ఉంటాయని రీసెంట్ గా చెప్పాడు డైరెక్టర్ పరశురామ్ .మహేష్- పరశురామ్ సినిమా మీద ఇప్పటి వరకూ అఫీషియల్ గా ఎలాంటి కన్ఫర్మేషన్ లేకపోయినా .. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ గట్టిగా నడుస్తోందట. అంతే కాదు ఈ సినిమాలో హీరోయిన్ కోసం కూడా సెర్చింగ్ మొదలు పెట్టారు.
ఈసారి సూపర్ స్టార్ కోసం మరో బాలీవుడ్ భామ పేరు కూడా వినిపిస్తోంది. బాలీవుడ్ లో మహేష్ బాబు అందానికి సరిపోయే యంగ్ అండ్ ఫ్రెష్ ఫేస్ ఎవరా అని వెతికితే ..ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా సెటిల్ అవుతున్న స్టార్ హీరో కూతురు సారా అలీఖాన్ తెలుగు స్క్రీన్ కి కొత్తగా ఉంటుందని ఆ హీరోయిన్ నే ఫిక్స్ అయిపోయ్యారని టాలీవుడ్ లో న్యూస్ నడుస్తోంది. ఈ కాంబినేషన్ మీద కూడా అఫీషియల్ అనౌనస్ మెంట్ ఇప్పటి వరకూ రాలేదు.
సారా కంటే ముందే చాల మంది హీరోయిన్లను చూశారు. వాళ్లలో కియారా అద్వానీ కూడా ఉంది. ఆల్రెడీ మహేష్ బాబుతో భరత్ అనునేను సినిమా చేసిన ఈ బాలీవుడ్ భామను పరశురామ్ సినిమాలో చెయ్యమని అడిగితే .. సారీ బాస్ ఆల్రెడీ బాలీవుడ్ లో నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాను..రెండేళ్లు అసలు ఎటూ కదిలే ఛాన్స్ కూడా లేదంటూ .. మహేష్ సినిమాకి నో చెప్పిందట కియారా అద్వానీ.
కియారా తోపాటు కీర్తి సురేష్ పేరు కూడా వినిపించింది. మహేష్ సరసన స్క్రీన్ కి కొత్త పెయిర్ అయితేబావుంటుందనుకున్న పరశురామ్ అండ్ బ్యాచ్ అనుకుంటున్నారు . ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోయే ఈ సినిమాలో ఓన్లీ గ్లామర్ హీరోయినే కాకుండా ఇంటెన్స్ ఎమోషన్స్ పలికించే హీరోయిన్ అయితే బావుంటుందని కీర్తిని కూడా లిస్ట్ లో పెట్టారట. మరి ఇంతమంది హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నా ఇంకా ఒక్కరు కూడా దొరకలేదు మహేష్ కి.