మెగా కుటుంబంలో హీరోల సంఖ్య క్రికెట్ టీమ్ ను తలపిస్తూ ఉంటుంది. దీనితో ప్రస్తుతం మెగా హీరోలకు బయట హీరోలతో పోటీకన్నా తమ కుటుంబ హీరోలతోనే పోటీ చాల ఎక్కువగా కనిపిస్తోంది. ఈ మెగా హీరోల కుటుంబంలోకి ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ పెద్ద కొడుకు అకిరా నందన్ వచ్చి చేరతాడు అని కలలు కంటున్నమెగా అభిమానుల ఆశల పై అకిరా నందన్ అభిప్రాయాలు నీరుగార్చాయి అంటూ మెగా అభిమానులు లోలోపల బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఇలా మెగా అభిమానులు అంతర్మధనంలోకి వెళ్ళిపోవడానికి గలకారణం రెండు రోజులక్రితం రేణు దేశాయ్ ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్. మొన్న జరిగిన మదర్స్ డే సందర్భంగా రేణు ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ తన పిల్లలు గురించి అనేక ఆసక్తికర విషయాలను వివరించింది. పవన్ కూతురు క్లాసికల్ డాన్స్ లోనే కాకుండా పియోనా వాయించడంలో ఆద్య కనపరుస్తున్న సమర్థత గురించి వివరించింది. 


ఇదే సందర్భంలో ఆమీడియా సంస్థ ప్రతినిధి అకిరా నందన్ టాలీవుడ్ లో ఏ హీరోను ఇష్టపడతాడు అని అడిగిన ప్రశ్నకు ఎవరు ఊహించని సమాధానం రేణు ఇచ్చింది. అకిరా తెలుగు సినిమాలను బాగా చూస్తాడని హీరోలలో అడవి శేషు అంటే అకిరా కు బాగా ఇష్టం అనీ ‘ఎవరు’ సినిమా చూసినప్పటి నుండి అకిరా కు అడవి శేషు పై మరింత అభిమానం పెరగడమే కాకుండా ‘అన్న’ అంటూ సంభోదిస్తాడని రేణు లీకులు ఇచ్చింది. 


ఇప్పుడు రేణు దేశాయ్ బయటపెట్టిన విషయం వైరల్ కావడంతో ఆమె పై మెగా అభిమానులు ముఖ్యంగా పవన్ అభిమానులు మండిపడుతున్నారు. రామ్ చరణ్ అకిరా నందన్ ను తన సొంత తమ్ముడుగా భావిస్తూ ఉంటాడని అంతే కాకుండా అన్నీ అనుకున్నట్లుగా జరిగితే అకిరాకు అభిరుచి ఉంటే తానే అకిరా నందన్ ను హీరోగా పరిచయం చేస్తానని చెప్పిన విషయాలను గుర్తుకు చేస్తూ ఇలాంటి సందర్భంలో మెగా కుటుంబంలో గ్యాప్ పెంచే విధంగా రేణు దేశాయ్ ఇలాంటి విషయాన్ని ఎందుకు బయటపెట్టింది అంటూ ఆమె పై పవన్ అభిమానులు మండిపడిపోతున్నారు. అయితే యాధృశ్చికంగా అకిరా నందన్ అభిప్రాయాల పై సరదాగా కామెంట్ చేస్తూ రేణు మాట్లాడిన విషయాలు ఇంత సీరియస్ గా మెగా అభిమానులు తీసుకుంటారని ఆమె కూడ ఊహించి ఉండదు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: