టాలీవుడ్ మూవీస్‌లో ఎన్నో ర‌కాల చిత్రాలుంటాయి. అయితే అందులో ఒక్కోటి ఒక్కో ర‌క‌మైన జోన‌ర్ ఉంటుంది. కొన్ని హాస్యానికి సంబంధించిన చిత్రాలుంటే..కొన్ని హార‌ర్‌, కొన్ని చ‌రిత్ర‌ను చాటి చెప్పే చిత్రాలు, మ‌రికొన్ని రొమాంటిక్ అండ్ ల‌వ్‌స్టోరీస్‌, ఇక స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్స్‌. వీటిలో అన్నిటికంటే కూడా ఎక్కువ‌గా ప్రేక్ష‌కులు స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్స్‌ని ఇష్ట‌ప‌డ‌తారు. ఇక మ‌రి ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్స్‌లో `యు ట‌ర్న్` చిత్ర‌మొక‌టి. అందులో స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించి మెప్పించింది. ఆది పినిశెట్టి, భూమిక‌, రాహుల్ రవీంద్రన్‌, న‌రేన్ మిగ‌తావారంతా కూడా త‌మ త‌మ పాత్ర‌ల్లో బాగానే న‌టించారు. ప‌వ‌న్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి నిర్మాతలుగా   శ్రీనివాసా చిట్టూరి, రాంబాబు బండారు వ్య‌వ‌హ‌రించారు.

 

స‌మంత వివాహం చేసుకున్న త‌రువాత తాను ఎంచుకునే క‌థ‌లు చాలా సెలెక్టివ్ గా ఉన్నాయి. ఎక్కువ‌గా న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల్లో న‌టిస్తూ మెప్పిస్తుంది.  రంగ‌స్థలం, అభిమ‌న్యుడు లాంటి సూప‌ర్ హిట్స్‌లో న‌టించిన‌ సామ్ మ‌రో సూప‌ర్ హిట్ చిత్రంలో న‌టించింది. ఆ చిత్రం క‌న్నడ‌లో ఘ‌న‌విజ‌యం సాధించిన `యు ట‌ర్న్‌` అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. లేడీ ఓరియంటెడ్ పాత్ర‌ల‌కి  ప్రాధాన్య‌మున్న క‌థ‌ల‌ను ఎక్కువ‌గా స్యామ్ ప్రాధాన్య‌మిస్తుంది. సూప‌ర్ నేచుర‌ల్‌ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం వ‌చ్చి మెప్పించింది. 

 

ఈ చిత్రం తొలి పది నిమిషాలు కాస్త నెమ్మదిగా సాగినా.. ఒక్కసారి అసలు కథ మొదలయ్యాక ఆడియన్స్‌ను కట్టిపడేసిన‌ట్లు ఉంటుంది క‌థ‌. ఎక్కడ అనవసరమైన కామెడీ, సాంగ్స్‌ లాంటివి ఇరికించకుండా పర్ఫెక్ట్ థ్రిల్లర్‌లా సినిమాను నడిపించాడు.  బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ కూడా ఈ సినిమా స్థాయిని పెంచింది. అయితే సెకండ్‌హాఫ్‌లో వ‌చ్చే కొన్ని ట్వీస్ట్ లు ఆడియన్స్‌ ముందే అంచనా వేయగలిగేలా ఉన్నాయి త‌ప్పించి మిగ‌తా క‌థంతా బాగానే ఉంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. అయితే అన్నిటికంటే ముందు ఇందులో స‌మంత పెర్ఫార్మెన్స్ మాత్రం హైలెట్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: