దక్షిణాది సినిమా రంగంలో టాప్ హీరోలతో సమానమైన క్రేజ్ నయనతారకు ఉంది. సౌత్ లో హీరోయిన్స్ కు సంబంధించి అత్యధిక పారితోషికం తీసుకునే నయనతార డేట్స్ ఇస్తే చాలు అని ఆలోచించే ఎందరో ప్రముఖ దర్శకులు టాప్ హీరోలు ఇప్పటికీ ఉన్నారు. ఆమె వయసు పెరుగుతున్న కొద్ది ఆమె పాపులారిటీ ఏమాత్రం తగ్గడంలేదు.


దీనికితోడు ఆమె వ్యక్తిగత జీవితం ఎప్పుడు తరుచు వివాదాస్పద విధంగానే ఉంటుంది. ముఖ్యంగా ఆమె ప్రేమ పెళ్ళి వ్యవహారాలు సమాధానం లేని పజిల్. ఇప్పటికే తన ప్రేమ వ్యవహారలో రెండుసార్లు ఫెయిల్ అయిన నయన్ ప్రస్తుతం తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో పీకల లోతు ప్రేమలో ఉంది. 


అయితే ఈమధ్య వీరిద్దరూ విడిపోయారు అంటూ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. ఈవార్తలు అన్నీ విఘ్నేష్ దృష్టికి రావడంతో చాల తెలివిగా మొన్న జరిగిన మదర్స్ డేని తనకు అనుకూలంగా మార్చుకుని పరోక్షంగా నయనతారను కార్నర్ చేసే విధంగా చేసిన ఒక ట్విట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో వైరల్ అవుతోంది. 


నయనతార ఒక పాపను ఎత్తుకున్న ఫోటోను పోష్ట్ చేస్తూ ‘నా పిల్లలకు జన్మనివ్వబోయే తల్లి చేతుల్లో ఉన్న పాప తల్లికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు’ అని విఘ్నేష్ వ్యూహాత్మకంగా ట్విట్ పెట్టాడు. దీనితో ఈ ట్విట్ నయనతార విఘ్నేష్ శివన్ లు విడిపోయారు అంటూ వార్తలు వ్రాస్తున్న మీడియా వర్గాలకు సమాధానంగా ఈ తమిళ దర్శకుడు ఇలా తెలివిగా వ్యవహరించాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. వాస్తవానికి వీరిద్దరి పెళ్లి గత ఏడాది డిసెంబర్ లోనే జరుగుతుందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆ పెళ్లి మళ్ళీ వాయిదా పడటంతో నయన్ విఘ్నేష్ శివన్ కు హ్యాండ్ ఇచ్చింది అంటూ గాసిప్పులు గుప్పుమంటున్నాయి. అయితే ఈ దర్శకుడు ఎంత తెలివిగా ప్రవర్తించినా ప్రతి విషయంలో చాల మొండిగా ప్రవర్తించే నయనతార తాను మనసులో ఏమి అనుకుందో అది చేసి తీరుతుంది అని అనుకోవడంలో ఎటువంటి సందేహంలేదు.. 
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: