సాధారణంగా సెలెబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితం గురించి ఎవ్వరికీ చెప్పాలని అనుకోరు. అందుకే మీడియా గుచ్చి గుచ్చి అడిగినా కూడా ఆ ప్రశ్నలని దాటవేస్తుంటారు. వ్యక్తిగత విషయాలలో స్వేచ్ఛని కోరుకోవడం వల్లే అలా చేస్తారని అంటుంటారు. అయితే అదొక్కటే కారణం కాదు. పర్సనల్ విషయాలని మీడియాకి లీక్ చేస్తే దాన్నే పట్టుకుని ఊరికే ప్రశ్నలు వేయడం, పుకార్లు పుట్టించడం ఇబ్బందిగా ఉంటుందన్న కారణంగానూ దాచిపెడుతుంటారు.

 

 

అయితే తాప్సీ పన్ను మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చింది. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తాప్సీ ఆ తర్వాత ప్రభాస్ సరసన మిస్టర్ పర్ ఫెక్ట్ లో కనిపించి మంచి విజయాన్ని అందుకుంది. అయితే సినిమాల ఎంపిక విషయంలో సరిగ్గా వ్యవహరించకపోవడంతో పరాజయాలని చవి చూసింది. దాంతో తెలుగుని వదిలేసి బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.

 

 

బాలీవుడ్ లో వరుస విజయాలని అందుకుంటూ దూసుకుపోతుంది.  పింక్ సినిమా మొదలుకుని, సూర్మా, మొన్న వచ్చిన తప్పడ్ వరకూ ఆమె ఖాతాలో అన్నీ విజయాలే. హీరోయిన్ గానే కాకుండా, లేడో ఓరియంటెడ్ సినిమాల్లోనూ సక్సెస్ వచ్చింది. అయితే పర్సనల్ విషయాల గురించి చెబుతూ, తనొక రిలేషన్ షిప్ లో ఉన్నానని తెలిపింది. తన పర్సనల్ విషయాలని దాచాల్సిన అవసరం తనకు లేదని, తన ఫ్యామిలీకి కూడా రిలేషన్ షిప్ లో ఉన్న విషయం తెలుసని ఒప్పుకుంది. 

 

 

అయితే అన్నీ చెప్పింది గానీ తాను ఎవరితో రిలేషన్ షిప్ లో ఉన్నానన్న విషయాన్ని మాత్రం వెల్లడిచేయలేదు. పర్సనల్ విషయాలని ధైర్యంగా  బయటపెట్టినప్పటికీ ఆ బోయ్ ఫ్రెండ్ పేరు మాత్రం చెప్పకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ విషయంలో తాప్సీ చాలా తెలివైందని అంటున్నారు. అయితే పేరు చెప్పకపోవడం వల్ల ఇంకా గాసిప్స్ పుట్టుకొస్తాయేమో అని సందేహిస్తున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: