టాలీవుడ్ లో కథ భిన్నంగా ఉండే సినిమాలకు ఎప్పుడు అయినా సరే మంచి ఆదరణ ఉంటుంది అనేది వాస్తవం. ముఖ్యంగా ప్రతిభ ఉన్న దర్శకులకు వాళ్ళు తీసిన సినిమాలకు ప్రతిభ ఉన్న హీరోలకు వాళ్ళు తీసే సినిమాలకు మంచి ఆదరణ ఎప్పుడు కూడా ఉంటుంది. టాలీవుడ్ లో ప్రతిభ ఉన్న నటుడు అనగానే కొంత మందికి ఈ తరంలో ప్రస్తావించే పేరు రానా దగ్గుబాటి. రానా తన కెరీర్ లో ఏ ఒక్క సినిమా కూడా రొటీన్ కథ తో చేయలేదు. అతని కథలు ప్రేక్షకులకు ఎక్కలేదు గాని చాలా సినిమాలు అతను నటించినవి అన్ని కూడా కథ భిన్నంగా ఉన్న సినిమాలే అనేది వాస్తవం. 

 

అందులో ప్రధానంగా చెప్పుకునే సినిమా సంకల్ప రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఘాజీ సినిమా. ఒక జలాంతర్గామి ఆధారంగా ఈ సినిమాను తీసుకొచ్చారు. వాస్తవ కథ ను సినిమా రూపంలో మార్చిన విధానం కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇక ఈ సినిమాలో పాకిస్తాన్ చేస్తున్న కుట్రలను ఎదుర్కొనే విధానం కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి గానూ ఏ విధంగా హీరో ప్రయత్నం చేస్తాడు ఎప్పుడు ఎం జరుగుతుంది అనేది ఈ సినిమాలో హైలెట్ గా చెప్పుకోవచ్చు. ఒక్క చిన్న గదిలో ఈ సినిమా ఉంటుంది. 

 

సముద్రపు నీటి ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో రానా నటన కూడా చాలా బాగా నచ్చింది ప్రేక్షకులకు. ఆ విధంగా తాను ప్రేక్షకులకు దగ్గరయ్యాడు రానా అనేది వాస్తవం. ఈ సినిమా తర్వాత దర్శకుడు పెద్దగా సినిమాలు చేయకపోయినా రానా లో ఉన్న టాలెంట్ ప్రేక్షకులకు స్పష్టంగా అర్ధమైంది అనే చెప్ప వచ్చు. ఈ సినిమా తర్వాత ప్రేక్షకులు కూడా కొత్తధనం అనేది ఆశించారు అనేది అందరి కి అర్ధమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: