క్లాస్, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకొంటూ కెరీర్‌పరంగా దూసుకుపోతున్నాడు నంద‌మూరి క‌ళ్యాణ్. ఈయ‌న‌ కెరీర్‌లో బెస్ట్  స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమాల్లో `118` మొద‌టి స్థానం అని చెప్పుకోవ‌చ్చు. నివేదా థామ‌స్‌, షాలిని పాండే హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రానికి ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కె.వి.గుహ‌న్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో దర్శకుడిగా మల్టీటాలెంట్ చూపించాడు గుహన్.  ఎస్ కోనేరు ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమా ను నిర్మించారు. డ్రీమ్స్‌, మిస్టరీ, ఇన్వెస్టిగేషన్‌, స్కామ్‌ లాంటి ఎలిమెంట్స్‌ని తీసుకుని ఒక పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో తెర‌కెక్కించి ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను బాగానే ఆక‌ట్టుకుంది.

 

ఇక ఈ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే.. గౌతమ్ (కల్యాణ్ రామ్) ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టు. అన్యాయాలను, అక్రమాలను ధీటుగా ఎదిరిస్తుంటాడు. మేఘా (షాలిని పాండే)ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ క్రమంలో ప్రతీ పౌర్ణమి రోజున ఆద్య (నివేదా థామస్) అనే అమ్మాయి దాడికి గురైనట్టు కల వస్తుంటుంది. కలలో కనిపించిన అమ్మాయి ఉన్న ప్రాంతాలు గౌతమ్‌కు తారసపడుతాయి. దాంతో ఆద్య కోసం వెతుకులాట మొదలుపెడుతాడు. ఆ సర్చింగ్‌లో భయంకర నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. అయితే ఆధ్య ఎవరు.? ఆమె కథ ఏంటి.? ఆద్య కోసం వెతికే క్రమంలో కలిసే ప్రతీ వ్యక్తి ఎందుకు చ‌నిపోతున్నారు? చివరికి ఆద్యకు జరిగిన అన్యాయం ఏంటి? అనేదే ఈ సినిమా క‌థ‌.

 

థ్రిల్ల‌ర్ సినిమాల‌కి కొన్ని ప్ర‌త్యేక‌మైన ల‌క్ష‌ణాలుంటాయి. క‌థ ప్రేక్ష‌కుడి ఊహ‌కు అంద‌కూడ‌దు, అదే స‌మ‌యంలో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగే స‌న్నివేశాలు అవ‌స‌రం. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడు కె.వి.గుహ‌న్ మంచి క‌స‌ర‌త్తులే చేశాడ‌ని చెప్పాలి. మొత్తంగా ఈ సినిమా క్ష‌ణ‌క్ష‌ణం చూసే ప్రేక్ష‌కుల్లో ఉత్కంఠ రేపుతుంది. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ నటన అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు.  రొమాంటిక్ సన్నివేశాల్లో నే కాకా యాక్షన్ సన్నివేశాల్లో కళ్యాణ్ రామ్ నటించిన విధానం అందర్నీ మెప్పిస్తుంది.  ఇక కొన్నేళ్లుగా హిట్టన్నదే లేకుండా పోయిన కళ్యాణ్ రామ్ 118 సినిమా మంచి కిక్ ఇచ్చింద‌నే చెప్పాలి.  స‌స్పెన్స్‌ థ్రిల్ల‌ర్ సినిమాలు ఇష్ట‌ప‌డేవారు.. ఈ సినిమాను ఖ‌చ్చితంగా చూడాల్సిందే.

 


 
 

మరింత సమాచారం తెలుసుకోండి: