ఎవరైనా స్టార్ హీరో బర్త్ డే వచ్చింది అంటే ఇక సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు  అనే విషయం తెలిసిందే. అయితే ఇంకొన్ని రోజుల్లో ఓ స్టార్ హీరో బర్త్ డే రాబోతోంది. స్టార్ హీరో ఎవరో కాదు నందమూరి నట వారసత్వాని కి ప్రతీక... నటనకు ప్రతిరూపం... నాట్యానికి నిలువుటద్దం.. ఎలాంటి పాత్రకైనా ప్రాణం పోసి మెప్పించగల గొప్ప నటుడు జూనియర్ ఎన్టీఆర్ మే 20వ తేదీన పుట్టినరోజు జరుపుకోబోతున్నారు . దీంతో అభిమానులు అందరూ తమ అభిమాన హీరో బర్త్ డే  సెలబ్రేషన్స్ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. 

 

 

 ఇక ఈ ఏడాది ఎన్టీఆర్ తన పుట్టిన రోజు నాడు ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అయిన ఆర్ఆర్ఆర్  నుంచి ఎన్టీఆర్ కు సంబంధించి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్... ఆ తర్వాత తన హిట్ కాంబినేషన్ అయిన త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇకపోతే రాజమౌళి సినిమా నుంచి ఎన్టీఆర్ కు సంబంధించి ఒక స్పెషల్ వీడియో ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు రాబోతుంది.దీని  కోసం అభిమానులు అందరూ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. మామూలుగానే సినిమా హీరోల బర్త్ డే లు అంటే సోషల్ మీడియా వేదికగా బర్త్ డే  విషెస్ వెల్లువెత్తడంతో పాటు అభిమానుల సెలబ్రేషన్స్ కూడా భారీ ఎత్తున ఉంటాయి. అంతేకాకుండా హీరోలకు తమ ప్రియమైన వారు ఒక మంచి గుర్తుండిపోయే బహుమతులను కూడా అందజేస్తూ  ఉంటారు.

 

 

 ఇక ఈ పుట్టినరోజుకి ఎన్టీఆర్ కు  అలాంటి ఒక గిఫ్ట్ ఒకటి అందనున్నట్లు  తెలుస్తోంది. గిఫ్ట్ ఇచ్చేది ఎవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ తో ఎంతో సన్నిహితంగా మెలిగే హీరో నారా రోహిత్. ఎన్టీఆర్ బర్త్ డే రోజున తను ఒక స్పెషల్ గిఫ్ట్ సిద్ధం చేస్తున్నట్లు గా నారా రోహిత్ తన సోషల్ మీడియా ఖాతాలో  తెలియజేశారు. ఆ స్పెషల్ గిఫ్ట్ ఏమిటో తెలుసుకోవాలంటే ఈనెల 20వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే అంటూ చెప్పుకొచ్చాడు. మామూలుగానే నారా రోహిత్ ఎన్టీఆర్ కి మధ్య సాన్నిహిత్యం బాగుంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్టీఆర్ కు పుట్టినరోజు నాడు నారా రోహిత్ ఇలాంటి స్పెషల్ ఇవ్వబోతున్నాడు అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: