కెరియ‌ర్ ప్రారంభంలోనే సినిమా పాత్ర‌ల ఎంపిక‌లో కాస్త తొంద‌ర‌ప‌డేదాన్ని కాని ఇప్పుడు ఆచి తూచి అడుగులు వేస్తున్నానంటుంది. ఇక మ‌నం చేసే ప‌నిలో ఏమైన త‌ప్పులు జ‌రిగాయంటే అది మ‌న‌కు ఏవో పాటాలు నేర్పించ‌డానికే అని అర్ధం. దాని నుంచి మ‌నం ఎంతోకొంత కొన్ని కొత్త‌ విష‌యాల‌ను నేర్చుకోవడానికే అని అర్ధం చేసుకోవాలి. ఆ తప్పుల నుంచి నేర్చుకున్న కొత్త విషయాల వల్లే ఇప్పుడు క్వాలిటీ పాత్రలను, సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాను” అని అంటోంది పూజా హెగ్డే.

 

ఇక ఈ బుట్ట‌బొమ్మ ప్ర‌స్తుతం మంచి ఊపు మీద ఉంది. వ‌రుస విజ‌యాల‌తో తెగ దూసుకుపోతుంది. ‘దువ్వాడ జగన్నాధం’, ‘మహర్షి’, ‘అరవిందసమేత వీర రాఘవ’, ‘అల వైకుంఠపురములో’ అంటూ ఇటీవల తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు స్టార్ హీరోలందరి చూపు ఆమె వైపే. పూజా హెగ్డే చేసిన సినిమాలు తక్కువే అయినా దక్షిణాదిన అందరి దృష్టి తన వైపుకు తిప్పుకుంది పూజా. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేయడానికి సిద్ధమే కానీ, అది ఇప్పుడే కాదంటోంది .

 

‘‘ఇక ఈ భామ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త‌నిస్తుంది.  ఒక నటిగా మరో కోణంలో అవి నన్ను చూపిస్తాయి. ఓ సినిమా వచ్చింది కానీ, నాకు నచ్చలేదు. నాకు నచ్చి ‘చేయగలను’ అనిపిస్తే.. చేయడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదంటుంది. అయితే, అలాంటి సినిమాలు చేయడానికి ఇంకా సమయముంది. కొంత వయస్సు అయిపోయిన తరువాత ఎలాగూ లవర్ పాత్రలు చేయలేను. లవర్‌ పాత్రలు, గ్లామర్‌ పాత్రలు ఇప్పుడు మాత్రమే చేయగలను అంటోంది ఈ భామ‌. అందుకే సీరియస్‌ పాత్రల వైపు ఇప్పుడప్పుడే దృష్టి పెట్టడంలేదు. ఇక పూజా కేవ‌లం టాలీవుడ్‌కే కాదు బాలీవుడ్‌లో కూడా త‌న హ‌వా బాగానే గ‌డుపుతుంది. మంచి మంచి సినిమాల్లో న‌టిస్తూ బాలీవుడ్‌లో హ‌వా సాగిస్తోంది.

 

 ప్రభాస్‌ ‘ఓ డియర్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) లో , అఖిల్‌కి జోడీగా ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’లో, అలాగే బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్‌ కాంబినేషన్‌లో ‘కభీ ఈద్‌ కభీ దివాలి’ చిత్రాల్లో నటిస్తోంది. లాక్‌డౌన్‌ అనంతరం ఈ చిత్రాల షూటింగ్‌తో పూజా య‌మ బిజీ కానుంద‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: