తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడు బోయపాటి శ్రీను ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది . ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను అలరించడం లో బోయపాటి శ్రీను తన మార్క్  చాటుకున్నాడు అనే విషయం తెలిసిందే. ఇక  మాస్ ప్రేక్షకులను  ఉర్రూతలూగించాలి  అంటే బోయపాటి సినిమా రావాల్సిందే. బోయపాటి సినిమా వచ్చిందంటే మాస్ ప్రేక్షకులందరికీ పండగ. తనదైన టేకింగ్ తో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుంటారు  బోయపాటి శ్రీను. ముఖ్యంగా ఫుల్ మాస్ ఎలిమెంట్స్ ఉన్న యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలను తెరకెక్కిస్తూ  మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంటాడు . 

 

 

 అయితే మాస్ ప్రేక్షకులకు బోయపాటి శ్రీను సినిమాలు అంటే అన్ని పండుగలు కలిసి ఒకే రోజు వచ్చినట్లే  ఫీలవుతుంటారు. మాస్ ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ మెండుగా  కనిపిస్తూ ఉంటాయి బోయపాటి సినిమాల్లో . అయితే బోయపాటి శీను సరిగ్గా ఇదే రోజున మే 12వ తేదీన 15 సంవత్సరాల క్రితం దర్శకుడిగా తన కెరీర్ను ప్రారంభించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రవితేజ హీరోగా ఆర్తి అగర్వాల్ హీరోయిన్ క భద్ర సినిమా తెరకెక్కి  సంచలన విజయాన్ని నమోదు చేసింది. 

 

 

 బోయపాటి శ్రీను టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో 15 సంవత్సరాల  పూర్తిచేసుకున్న సందర్భంగా ఎంతోమంది బోయపాటి శ్రీనుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భద్ర సినిమా నుంచి  విజయంతో బోయపాటి శ్రీను ముందుకు సాగుతున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే ఒక హీరోకి ఉన్న మాస్  అభిమానులు... తమ అభిమాన హీరో ని ఎలా చూడాలి అనుకుంటున్నారో... బోయపాటి సినిమాలు తన హీరోని అలా చూపిస్తూ ఉంటారు. 

 

 

 ఇక యాక్షన్ సన్నివేశాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బోయపాటి సినిమాలో దాదాపుగా ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలు కనిపిస్తూ ఉంటాయి. అది కూడా ఏదో సాదాసీదా యాక్షన్ అనుకునేరు.. బోయపాటి సినిమాలు యాక్షన్ సన్నివేశాలు చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఇక బోయపాటి శ్రీను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో 15 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా శ్రేయాస్ మీడియా కంగ్రాట్స్ చెబుతూ ఒక ట్విట్  పెట్టింది.భద్ర సినిమా తో కెరియర్ ప్రారంభించి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన సినిమాలను తెరకెక్కించి  విజయంతో ముందుకు సాగుతున్న బోయపాటికి  శుభాకాంక్షలు అంటు  తెలిపింది . ఇక ఇప్పుడు ప్రస్తుతం బాలకృష్ణతో తెరకెక్కిస్తున్న మూడో సినిమా  ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ హిట్ సాధించాలని  కోరుకుంటున్నట్లుగా పెట్టిన  ఒక ట్విట్  ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: