బాలీవుడ్ ఇండస్ట్రీ డీప్ రొమాన్స్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. సినిమాలలో హీరో హీరోయిన్ల మధ్య లిప్ లాక్ సీన్లు అయితే చాలా కామన్గా ఉంటాయి. లిప్ లాక్ సీన్లు  లేకుండా బాలీవుడ్ సినిమా ఉండదు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కూడా కుర్ర  హీరోయిన్ ల  దగ్గర నుంచి సీనియర్ హీరోయిన్ల వరకు అందరూ లిప్లాక్లు చేస్తున్నారు సినిమాల్లో. అయితే అదే లిఫ్ లాక్ ల  కారణంగా లీగల్  సమస్యలు వచ్చి పడతే  ఎలా ఉంటుంది. లిప్ లాక్ ద్వారా లీగల్ సమస్యలు ఎందుకు వస్తాయి అని అంటారా..?  

 

 

 నిజమే ఓ  స్టార్ హీరోయిన్ కి లిప్ లాక్ కారణంగా లీగల్ సమస్యలు వచ్చిపడ్డాయి . స్వయంగా  ఆ స్టార్ హీరోయిన్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు ఐశ్వర్యరాయ్. ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ ఎంతో గుర్తింపు సంప్రదించింది...  ఇక ఆ తర్వాత బాలీవుడ్లో సినిమాలు చేసుకుంటూ... ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. అయితే మొదటి నుంచి లిప్ లాక్ సీన్లకు దూరంగానే ఉంది. కానీ 2006లో హృతిక్ రోషన్ అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య ప్రధాన పాత్రల్లో  వచ్చిన దూమ్ 2 సినిమాలో హృతిక్ రోషన్ తో ఒక డీప్ లిప్ లాక్ చేసింది. 

 

 

 ఇక ఈ లిప్ లాక్ సీన్ తనను  లీగల్ సమస్యల్లో కి నెట్టేసింది అంటూ ఒకానొక సమయంలో ఐశ్వర్య చెప్పుకొచ్చింది.లిప్ లాక్  సీన్ తర్వాత తనకు లీగల్ నోటీసులు వచ్చాయి అంటూ తెలిపింది.  మీరు సమాజంలో బాధ్యత కలిగిన వ్యక్తులు.. మీరు ఏదైనా పని చేసేటప్పుడు బాధ్యతగా చేయాలి అంటూ చాలా మంది తనకు నోటీసులు పంపారు అంటూ గుర్తు చేసింది ఐశ్వర్య. అయితే ఆ సినిమాలో మాత్రమే అవసరమైనంత మేరకు మాత్రమే నటించానని... చెప్పుకొచ్చింది. లీగల్ నోటీసుల పై మొదట కాస్త ఇబ్బందిగా అనిపించినా అభిమానులు తమ పట్ల చూపించిన అభిమానానికి ఎంతో ఆనందంగా అనిపించింది అంటూ తెలిపింది ఐశ్వర్యరాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: