‘బాబూ.. రెడీ.., సైలెన్స్, స్టార్ట్ కెమెరా.. యాక్షన్..’ అంటూ ప్రతి డైరక్టర్ ప్రతి షాట్ కు ముందు చెప్పేదే. కానీ.. పైమాటలు చెప్తూ స్క్రీన్ మీద ప్రత్యక్షమయ్యే ఒకే ఒక్క డైరక్టర్ బోయపాటి శ్రీను మాత్రమే. టాలీవుడ్ లో ఇలా ధైర్యంగా సినిమా ప్రారంభంలో రావాలంటే కొంచెం ధైర్యం కావాలి. తన సినిమాలో హీరోకు ఎంత ధైర్యం, తెగింపు ఉంటాయో దర్శకుడిగా బోయపాటికి అలాంటి గట్సే ఉంటాయి. కాబట్టే ధైర్యంగా తన బొమ్మతో సినమా మొదలుపెడతాడు. దర్శకుడిగా కెరీర్ మెదలుపెట్టి 15 ఏళ్లు పూర్తైన సందర్భంగా భావోద్వేగంతో ప్రేక్షకులకు బహిరంగ లేఖ రాశాడు.

IHG

 

‘ఎన్నో ఆశలతో 15ఏళ్ల క్రితం దర్శకుడిగా నా ప్రస్థానం ప్రారంభించాను. మనసులో ఎంతో అలజడి, ఒత్తిడితో 2005 మే15న తొలి సినిమా భద్రతో వచ్చాను. కానీ, మీ ఆశీర్వాదంతో నా ఒత్తిడిని జయించాను. ఈ 15 ఏళ్లు ఎంతో త్వరగా గడచిపోయాయి. ఈ ప్రయాణంలో నాకు సహకరించిన, నాతో వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. ఈ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రేక్షకులు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, రచయితలు, టెక్నీషియన్లు, నా కుటుంబం.. వీరందరినీ ఇచ్చిన భగవంతుడికి సదా కృతజ్ఞుడిని. మీనుంచి ప్రతిసారి నాకు అందుతున్న సహాయ సహకారాలకు మరోసారి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. BB3తో మీ ముందుకు త్వరలోనే వస్తాను.. మీ బోయపాటి శ్రీను’ అని రాసుకున్నాడు.

IHG

 

బోయపాటి శ్రీను సినిమాలన్నీ హీరోను మాస్ కోణంలో ఎలివేట్ చేస్తాయి. అదే హీరోయిజంను కుటుంబ కథకు జోడిస్తాడు. ఇదే బోయపాటిలోని ప్రత్యేకత. కుటుంబ ప్రేక్షకులకు చేరువయ్యే కథనంలో హీరో ఎలివేషన్ ను చేయడంతో బోయపాటికి సాటి మరెవరూ లేరనే చెప్పాలి.  బోయాపాటి ప్రస్తుతం బాలకృష్ణతో సినిమా చేస్తున్నాడు. బాలయ్యతో బోయపాటికి ఇది మూడో సినిమా. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: