టాలీవుడ్ లో రాణించాలంటే ఎవరో ఒకరి సపోర్ట్ అవసరం. కాని ఎవరి సపోర్ట్ లేకుండా చిన్న చిన్న పాత్రలతో కింద స్థాయి నుండి వచ్చిన వాడు నాచురల్ స్టార్ నాని. బాపు గారి దగ్గర సహాయ దర్శకుడిగా, హైదరాబాద్ లో రేడియో జాకీ గా పని చేసి ఒక యాడ్ ద్వారా అష్ట చమ్మా సినిమాలో అవకాశం అందుకుని వెండి తెర పై అడుగు పెట్టాడు. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో వెనక్కి తిరిగి చూసే పని లేకుండా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. దీని తో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ని సెట్ చేసుకున్నాడు. 

 

అయితే నాని కెరీర్ లో ఎన్నో విజయాలు, అపజయాలు కూడా ఉన్నాయి. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ తనకున్న ఇమేజ్ తో మార్కెట్ ని పెంచుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో ఇప్పుడు నాని రెండు సినిమాలు ఓకే చేసారు. ఇప్పటికే వాటిల్లో ఒకటి నాని కెరీర్లో 25 వ చిత్రం “ వి” సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. కాని లాక్ డౌన్ నేపధ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. టాక్సి వాలా దర్శకుడు రాహుల్  సంకర్సన్ దర్శకత్వంలో వస్తున్న శ్యాం సింగ రాయ్ సినిమా ఒకటి.  

 

శ్యాం సింగ్ రాయ్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా అభిమానులను ఆకర్షిస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియా లో వస్తున్న వార్తలు వింటుంటే ఈ సినిమా పై అంచనాలు పెరిగిపోతున్నాయి. దర్శకుడు రాహుల్ నాని ని గతంలో ఎన్నడు చూడని విధంగా చూపిస్తున్నట్టు సినీ వర్గాల కథనం. విభిన్నమైన కథతో, విలక్షణమైన పాత్రతో నాని కెరీర్ లో నిలిచిపోయే సినిమాగా ఉంటుందని ఇండస్ట్రీ టాక్.  ఇక పోతే “వి” సినిమాలో నాని పాత్ర విభిన్న షేడ్స్ ఉన్న పాత్ర అని తెలుస్తుంది. మరి చూడాలి నాని యొక్క నెగిటివ్ రూల్..

మరింత సమాచారం తెలుసుకోండి: