టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది కమెడియన్లు తమ సత్తా చాటుతూ వస్తున్నారు. ఏ సినిమాకైనా కమెడియన్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది.  ఈ మద్య యువ కమెడియన్లు వెన్నెల కిషోర్, సప్తగిరి, ప్రియదర్శి లతో పాటు జబర్ధస్త్ టీమ్ అదరగొడుతున్నారు.  హీరోల ఫ్రెండ్స్ గా నటిస్తూ తమదైన కామెడీ మార్క్ చాటుకుంటున్నారు.  తరుణ్ భాస్క్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ‘పెళ్లిచూపులు’ సినిమాలో కమెడియన్ గా నటించిన ప్రియదర్శి తర్వాత వరుసగా కమెడియన్ ఛాన్సులు దక్కించుకంటున్నాడు. మొదటి నుంచి కూడా ప్రియదర్శి విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ వస్తున్నాడు. ఒక వైపున కమెడియన్ గా నవ్విస్తూనే, మరో వైపున కీలకమైన పాత్రలను చేస్తున్నాడు. తాజాగా ఆయన 'లూజర్' అనే వెబ్ సిరీస్ చేశాడు.  తన మాట స్టైల్, మేనరీజం చాలా ప్రత్యేకంగా ఉంటాయి.

 

 

తాజాగా 'లూజర్' అనే వెబ్ సిరీస్ తీశాడు.. అన్నపూర్ణ స్టూడియోస్ వారు ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు.  తాజాగా  ఇంటర్వ్యూలో ప్రియదర్శి మాట్లాడుతూ ..  మొదటి నుంచి విభిన్నమైన పాత్రలకి నేను ప్రాధాన్యతనిస్తూ ఉండటంతో, 'మీరు కమెడియన్ నా? కేరక్టర్ ఆర్టిస్ట్ నా? అని అడుగుతున్నారు. అన్నిరకాల పాత్రలను చేయగలనని అనిపించుకోవాలని ఉద్దేశంతోనే నేను ఈ రూట్లో వెళుతున్నాను. తనకు ఎలాంటి పాత్రలైనా సూట్ అవుతున్నాయని.. ఆ మద్య విలన్ గా కూడా నటించానని అన్నారు.

 

 

కామెడీ చేయడం చాలా తేలికని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి కామెడీ చేయడమే చాలా కష్టం. ఆ విషయంలోను మంచి మార్కులు తెచ్చుకున్నాను. అంతే కాదు ఇక విలన్ పాత్రలు చేయాలని వుంది. నటుడిగా నిరూపించుకోవాలంటే అన్నిరకాల పాత్రలు చేయాలనేదే నా ఉద్దేశం. ఇంతవరకూ నాకు లభించిన పాత్రల పట్ల సంతృప్తికరంగా వున్నాను  అని చెప్పుకొచ్చాడు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: