మన తెలుగులో చిరంజీవి కి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఆయన సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన సినిమా కోసం ప్రేక్షకులు పనులు మానుకుని కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన సినిమాలకు కాస్త ఆదరణ తగ్గింది. ఆయన సీనియర్ హీరో కావడం ఆయన ను ఆదరించిన తరం ఇప్పుడు సినిమాల మీద పెద్దగా ఆసక్తి చూపించకపోవడం అన్నీ కూడా చిరంజీవి ని కాస్త ఇబ్బంది పెడుతున్నాయి. ఆయన రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా నుంచి మొన్న విడుదల అయిన సైరా సినిమా వరకు అన్నీ కూడా ప్రేక్షకులకు బాగానే ఇబ్బంది పెట్టాయి అనేది కొందరు అనే మాట. 

 

దానికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని ఆయన సినిమాలు అనగానే ఇప్పుడు టాలీవుడ్ లో ఎవరూ కూడా ముందుకు రావడం లేదు. దీని తో ఆయన ఇప్పుడు సినిమాల్లో తన పాత్రను హీరో నుంచి తగ్గించుకుని ఇతర పాత్రలను చెయ్యాలని ఇక యాక్షన్ సన్నివేశాలు అవసరం లేదు అని అంటున్నారట. ఇక యాక్షన్ సీన్లు లేని సినిమాలను చేయడానికి గానూ చిరంజీవి ప్రయత్నాలు చేస్తున్నారు అని కొన్ని రోజులు గా వార్తలు వస్తున్నాయి. మరి ఏ సినిమాలు చేస్తారు అనేది చూడాలి. 

 

రామ్ చరణ్ హీరో గా వచ్చే సినిమాలో ఆయన తండ్రి పాత్రలు ఇతర హీరోల సినిమాల్లో కూడా లాంటి పాత్రలే చెయ్యాలి అని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఏ సినిమాలు చేస్తారు అనేది లాక్ డౌన్ తర్వాత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. మన తెలుగులో చిన్న హీరోల సినిమాల్లో ఆయన కీలక పాత్రలు చేయడానికి సిద్దమవుతున్నారు అని అంటున్నారు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: