సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల వరుసగా పలు సక్సెస్ఫుల్ సినిమాల్లో నటిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన హీరోగా తెరకెక్కిన పెట్టా, దర్బార్ సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. వాస్తవానికి తెలుగులో యావరేజ్ విజయాలు అందుకున్న ఆ సినిమాలు రెండూ, తమిళ్ లో మాత్రం బాగానే సక్సెస్ సాధించాయి. ఇక వాటి తరువాత ప్రముఖ మాస్ సినిమాల దర్శకుడు శివ దర్శకత్వంలో రజినీకాంత్ ఒక సినిమా చేయడానికి నిశ్చయించి ఇటీవల ఆ సినిమాని మొదలెట్టారు. ఆ సినిమాకు అన్నాథే అనే టైటిల్ ని నిర్ణయించి ఇటీవల టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు.

 

గతంలో అజిత్ తో వరుసగా వీరం, వేదాళం, వివేకం, విశ్వాసం సినిమాలు తీసి మంచి సక్సెస్ లు అందుకున్న శివ, ప్రస్తుతం రజినీకాంత్ తో తీస్తున్న అన్నాథే సినిమాని కూడా ఒక మంచి పవర్ఫుల్ స్టోరీ తో తెరకెక్కిస్తున్నట్లు టాక్. నయనతార, కీర్తి సురేష్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, సూరి, ఖుష్బూ, మీనా తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డి ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి వెట్రి కెమెరామ్యాన్ గా వ్యవహరిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలావరకు పూర్తి అయినట్లు సమాచారం. 

 

కాగా తమ సినిమాని రాబోయే 2021వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నట్లు కాసేపటి క్రితం తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వెల్లడించింది సన్ పిక్చర్స్ సంస్థ. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటన రాగానే రజిని ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి కొంత ఇంటర్నల్ వర్క్ ని యూనిట్ సభ్యులు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. లాక్ డౌన్ అనంతరం ఎంతో వేగవంతంగా బ్యాలన్స్ షూటింగ్ ని పూర్తి చేస్తారట. మంచి యాక్షన్, మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజినీకాంత్ క్యారెక్టర్ ఆయన ఫ్యాన్స్ కి ఎంతో కిక్ ఇస్తుందని అంటున్నారు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: