పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా వస్తుందంటేనే ఫ్యాన్స్ కు పండగ. క్రేజీ డైరక్టర్ కాంబినేషన్ లో వస్తుందంటే సంబరాలే. అదే.. పవన్ పవర్ ను కిర్రాక్ స్టైల్లో చూపించే మాస్ డైరక్టర్ తో సినిమా వస్తుందంటే వారి అంచనాలకు ఆకాశమే హద్దు. త్వరలో హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కే పవన్28 మూవీపై పవన్ అభిమానులు ఇవే అంచనాలు పెంచేసుకుంటున్నారు. సినిమా టైటిల్ విషయంలో కూడా క్లారిటీ వచ్చేసిందనే వార్త వారిలో ఆనందాన్ని నింపుతోంది.

 

 

పవన్ 28వ సినిమా టైటిల్ గా ‘ఇప్పుడే మొదలైంది’ అనుకుంటున్నారని.. దాదాపుగా ఇదే ఫిక్స్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్. దీనిని హరీశ్ శంకరే నర్మగర్భంగా రివీల్ చేశాడని వారు ఓ ఉదాహరణ చూపిస్తున్నారు. నిన్న గబ్బర్ సింగ్ విడుదలై 8ఏళ్లు అయిన సందర్భంగా టీమ్ కు కృతజ్ఞతలు చెప్తూ ఓపెన్ లెటర్ రాశాడు హరీశ్ శంకర్. ఆ లెటర్ చివరలో ‘ఇప్పుడే మొదలైంది’ అనే వాక్యాన్ని హైలైట్ చేస్తూ పెద్దగా రాశాడు. దీంతో ఇదే టైటిల్ అయి ఉంటుందని ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఇప్పుడే మొదలైంది.. అంటూ గబ్బర్ సింగ్ ఇంటర్వల్ బ్లాక్ లో పవన్ చెప్పిన డైలాగ్ సినిమా సెకండాఫ్ పై అంచనాలు పెంచేసింది.

IHG

 

ఇప్పుడీ సినిమాపై పెరుగుతున్న అంచనాలకు ఇదే టైటిల్ గా సరిగ్గా సరిపోతుందని ఫ్యాన్స్ అభిప్రాయం. మరి హరీశ్ మనసులో ఏముందో తెలియాలన్నా.. ఈ వార్తలో నిజమెంతుందో తెలియాలన్నా అఫిషియల్ కన్ఫర్మేషన్ రావాల్సిందే. ఇప్పటికే ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా దేవీశ్రీ ప్రసాద్ కన్ఫర్మ్ అయిపోయాడు. హీరోయిన్ గా మళయాళం నుంచి మానస రాధాకృష్ణన్ అనే పేరు రౌండ్ అవుతోంది. ఈ వార్తలన్నీ సినిమాపై ఉన్న క్రేజ్ కు నిదర్శనంగా చెప్పాలి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మించనుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: