కాలం చేసే విచిత్రాల‌కు అంతులేదు. ఒక చోట విషాదం ఉంటే..ఇంకొక చోట ఆనందం ఉంటుంది. ఈ క్ర‌మంలోనే మ‌న‌కు ఎప్పుడు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. ఇందుకు నిద‌ర్శ‌నం షాగుఫ్తా రఫీక్. ఇంత‌కీ ఈమె ఎవ‌రు..? అనేగా మీ ప్ర‌శ్న‌. షాగుఫ్తా రఫీక్ బాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ రచయిత. ఎన్నో చిత్రాలకు ఈమె కథలు అందించారు. తెలుగులోనూ `నీ జతగా.. నేనుండాలి` అనే సినిమాకు ర‌చ‌యిత‌గా ప‌నిచేశారు. అయితే ఈమె జీవితంలో చోటుచేసుకున్న‌ చిత్రాలు, విచిత్రాలు చూస్తే క‌న్నీళ్లు ఆగ‌వు. వాస్త‌వానికి షాగుఫ్తా రఫీక్‌కు ఇప్ప‌టికీ ఆమె క‌న్న‌తల్లి దండ్రులు ఎవరో తెలియదు. 

 

షాగుఫ్తా రఫీక్‌ను ఓ మహిళ దత్తత తీసుకుని పెంచుకుంది. అయితే స‌ద‌రు మ‌హిళ వేరే వ్య‌క్తి సంబంధం పెట్టుకుని.. హ్యాపీగా షాగుఫ్తాతో క‌లిసి లైఫ్ లీడ్ చేసేది. కానీ, అతడు ఆకస్మిక మరణం చెందడంతో షగుఫ్తా, ఆమె పెంపుడు తల్లి ఇద్దరూ రోడ్డున ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే ఎన్నో క‌ష్టాల‌ను అనుభ‌వించారు. ఇక చివ‌ర‌కు షాగుఫ్తా బ‌త‌క‌డానికి.. తాను చేసేది త‌ప్పుడు ప‌ని అని తెలిసినా.. మ‌రోదారి లేక 16 ఏళ్ల వయసులోనే బార్ డాన్సర్ గా, వ్యభిచారిగా మారింది. ఇలా ప్రైవేట్ పార్టీలలో ఎక్స్‌పోజింగ్‌ చేస్తూ డాన్స్ చేస్తుంటే తనపై డబ్బులు చల్లేవారని షాగుఫ్తా రఫీక్ ఇటీవ‌ల చెప్పుకొచ్చింది. 

 

అప్పుడు ఒక మహిళని సమాజంలో ఎలా చూస్తారో తాను అర్థం చేసుకున్నాన‌ని ఆమె బాధ‌ను వ్య‌క్తం చేసింది. అయితే ఈ క్ర‌మంలోనే షాగుఫ్తా.. త‌న‌కు రచనపై ఉన్న ఆసక్తిని గుర్తించింది. దీంతో ఆ దిశ‌గా అడుగులు వేయ‌డం ప్రారంభించింది. ఇలాంటి స‌మ‌యంలోనే  బాలీవుడ్ బడా నిర్మాత మహేష్ భట్ ఆమెకు అవకాశం కల్పించారు. ఆ ఒక్క ఛాన్స్‌తో తానేంటో నిరూపించుకున్న షాగుఫ్తాకు వ‌రుస‌గా అవ‌కాశాలు త‌లుపు త‌ట్టాయి. దీంతో ఏ అవ‌కాశాలు మిస్ కాకుండా.. త‌న‌లో ఉన్న గొప్ప క‌ళను మొత్తం బ‌య‌ట‌కు తీసి క్రేజీ రచయితగా మారిపోయింది. రాజ్, మర్డర్ 2, జిస్మ్ 2, ఆషిక్ 2 లాంటి రొమాంటిక్ చిత్రాలకు రచయితగా ప‌ని చేసిన  షాగుఫ్తా రఫీక్ సూప‌ర్ స‌క్సెస్ అయింది.
 
   
 
   
    

మరింత సమాచారం తెలుసుకోండి: