తెలుగు సినిమాల్లో అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా తెరంగేట్రం చేసిన అక్కినేని నాగార్జున రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. నాగ్ కు యూత్ లో బాగా క్రేజ్ తెచ్చిన సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకునే సినిమా ‘గీతాంజలి’. దిగ్గజ తమిళ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ సినిమా విడుదలై నేటితో 31 ఏళ్లు పూర్తి చేసుకుంది. నాగార్జున కెరీర్లో ఆణిముత్యంలా నిలిచిపోయిన ఈ సినిమా 1989 మే12న విడుదలైంది.

IHG

 

అప్పటికి యువ సామ్రాట్ గా పేరు తెచ్చుకున్న నాగార్జునను యూత్ కి దగ్గర చేసింది. సినిమా ఆద్యంతం స్లో నెరేషన్ ఉన్నా దర్శకుడిగా మణిరత్నం కథనం ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. సినిమా అంతా నాగార్జున గెడ్డంతోనే కనిపిస్తాడు. అభిమానులు, ప్రేక్షకులు నాగ్ లుక్ కి కథకి ఫిదా అయిపోయారు. హీరోయిన్ కు నాగార్జునకు వచ్చే సరదా సన్నివేశాలు.. ముఖ్యంగా వారిద్దరి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు యూత్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. రైల్వే స్టేషన్ లో వచ్చే సీరియస్ సీన్ మణిరత్నం టేకింగ్ స్థాయి ఏంటో నిరూపిస్తుంది. ఇళయరాజా సంగీతంలోని పాటలన్నీ ఆణిముత్యాలే. వేటూరి సాహిత్యం, లోకేషన్లు, పీసీ శ్రీరామ్ ఫోటోగ్రఫీ ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేశాయి.

IHG

 

తన నటనతో ఆకట్టుకున్న హీరోయిన్ గిరిజా షెట్టర్ కు అదే మొదటి, చివరి సినిమా. తెలుగు ప్రేక్షకులు ఇష్టపడని ట్రాజెడిక్ ఎండింగ్ కు విరుద్దంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిందంటే సినిమా కంటెంట్ ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. భాగ్యలక్ష్మీ పిక్చర్స్ పై సీఎల్ నరసారెడ్డి నిర్మించిన ఈ సినిమా 24 సెంటర్లలో 100 రోజులు ఆడింది. తమిళ్ లో ఇదుయాత్తూ తిరుడత్తైగా తమిళ్ లో డబ్ అయి అక్కడా 100 రోజులు రన్ అయింది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: