పూజ హెగ్డే కి టాలీవుడ్ లో ఉన్న డిమాండ్ గురించి అందరికి తెలిసిందే. ఆమె సినిమాల కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారు అనేది అందరికి తెలిసిన విషయమే. ఆమెకు ఇప్పుడు మన తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆమె వరుసగా అదే హోదా తో సినిమాలు కూడా చేస్తుంది. అగ్ర హీరోల తో మినహా అచిన్న హీరో లతో ఆమె పెద్దగా సినిమాలను చేసే సాహసం చేయడం లేదు అని వార్తలు కూడా వస్తున్నాయి. చేసే హీరోల తో భారీగా ఆమె డిమాండ్ చేస్తుంది అని కూడా అంటున్నారు. 

 

ఇప్పుడు ఈ విషయంలో ఆమె జాగ్రత్త పడుతుంది అని అంటున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు టాలీవుడ్ దర్శక నిర్మాతలు అందరూ కూడా హీరోయిన్ ల విషయంలో రేటు తగ్గించుకునే విధంగా అడుగులు వేస్తున్నారు. అందుకే ఎక్కువగా డిమాండ్ చేసే వాళ్ళను పక్కన పెట్టే ఆలోచన లో ఉన్నారు అని తెలుస్తుంది. అగ్ర దర్శకులు అయినా చిన్న దర్శకులు అయినా సరే ఇప్పుడు ఇదే ఆలోచనలో ఉన్నారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఇప్పుడు మన తెలుగులో పూజ కు మంచి డిమాండ్ ఉన్నా సరే ఆమె ఎక్కువగా డిమాండ్ చేయడం మనం చూస్తున్నాం. 

 

అందుకే ఇప్పుడు ఆమె వెంట పడాల్సిన అవసరం లేదని కొందరు దర్శక నిర్మాతలు భావిస్తున్నారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఇక వాళ్ళను పక్కన పెట్టడమే మంచిది అనే ఆలోచన లో తెలుగు లో స్టార్ హీరోలు కూడా ఉన్నారు అని ప్రతిభ ఉన్న హీరోయిన్ లు చాలా మంది ఉన్నారు అని వాళ్లకు అవకాశాలు ఇవ్వడం  మంచిది గాని ఇలాంటి హీరోయిన్ లకు అవసరం లేదని భావిస్తున్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: