టాలీవుడ్ లో కొందరు దర్శకులు మనకు అలా గుర్తు ఉంటారు. వాళ్ళు చేసిన సినిమాలు వాళ్ళు పరిచయం చేసిన హీరోలు అందరూ కూడా మన కళ్ళ ముందే ఉంటారు. ఇక వారు చేసిన సినిమాల్లో ఉండే కొన్ని సన్నివేశాలు కూడా ప్రేక్షకులకు అలా గుర్తు ఉంటాయి. అగ్ర దర్శకులు గా ఒక వెలుగు వెలిగిన దర్శకులు ఎందరో మన తెలుగులో ఉన్నారు. అందులో ప్రధానంగా చెప్పుకునే దర్శకుడు దాసరి నారాయణ. ఆయన సినిమాలు అన్నీ కూడా ఒక సంచలనం. ఎన్నో సినిమాల్లో ఆయన ప్రేక్షకులకు మెప్పించారు. ప్రతీ సన్నివేశం కూడా ఆయన సినిమాల్లో ప్రేక్షకులకు బాగా నచ్చుతు ఉంటాయి అనేది వాస్తవం. 

 

ఇప్పుడు ఆయన బయోపిక్ ని తీసుకుని వచ్చే ప్రయత్నాలు టాలీవుడ్ లో జరుగుతున్నాయి అని సమాచారం. ఆయన బయోపిక్ ని తీసుకుని రావడానికి గానూ కొందరు కష్టపడుతున్నారు అని అంటున్నారు. ఆయన బయోపిక్ ని తీసుకుని రావడానికి గానూ మోహన్ బాబు చిరంజీవి ప్రయత్నాలు చేస్తున్నారు అని తెలుస్తుంది. అగ్ర నిర్మాత గా దర్శకుడి గా ఆయన టాలీవుడ్ లో ఒక సంచలనం. ఆయన చేసిన సినిమాలతో స్టార్ హీరోలు అయిన వాళ్ళు మన తెలుగులో చాలా మందే ఉన్నారు. విజయశాంతి రేంజ్ పెంచే సినిమాలు తీసుకొచ్చింది కూడా ఆయనే. 

 

ఆ విధంగా ఆయన టాలీవుడ్ లో తన ప్రభావం చూపించారు. ఇప్పుడు ఆయన సినిమాను తీసుకుని రావడానికి మోహన్ బాబు చిరంజీవి కలిసి ప్రయత్నాలు చేస్తున్నారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఆయన సినిమా అంటే సాధారణ విషయం కాదు. ఆయనకు రాజకీయాలకు కూడా లింక్ ఉంటుంది. కేంద్ర మంత్రి గా కూడా ఆయన పని చేసారు కాబట్టి ఆయన సినిమా తీసుకుని రావడం అంత ఈజీ కాదు అని కొందరు టాలీవుడ్ లో అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: