జబర్దస్త్ కామెడీ షో నుంచి పరిచయమైన ఎంతో మంది నటుల్లో మహేష్ కూడా ఒకడు. మహేష్ ఆచంట అంటే గుర్తుపట్టకపోయినా.. 'జబర్దస్త్' మహేష్ లేదా 'రంగస్థలం'లో చిట్టిబాబు అసిస్టెంట్‌ అనగానే ఇట్టే గుర్తుపడతారు జనాలు. ప‌ట్టుద‌ల ఆత్మ‌విశ్వాసంతో అనుకున్నది సాధించాడు మ‌హేశ్. ఇప్పుడు వెండితెర‌పై త‌న‌కంటూ ఓ సెప‌రేట్ ఐడెంటీని క్రియేట్ చేసుకున్నాడు. అతడి మాట తీరు.. వేషధారణ అంతా కాస్త ప్రత్యేకమనే చెప్పుకోవాలి. సినిమా ద‌ర్శ‌కులు సైతం.. అత‌డి బాడీ లాంగ్వేజ్ కు త‌గ్గ‌ట్లుగా క్యారెక్ట‌ర్లు రాసుకుంటున్నారు అంటే.. మహేష్ ప్రత్యేకత ఏంటో అర్థ‌మ‌వుతుంది. ఇప్పుడు సినిమాల్లో కూడా మంచి మంచి పాత్రలు చేస్తూ క్రేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా శతమానం భవతి చిత్రంతో ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు. ఆ తర్వాత రంగస్థలం చిత్రంతో మనోడి దశ మారిపోయింది. అప్పటి వరకు జబర్దస్త్ మహేష్ అనేవాళ్లు కాస్తా ఆ తర్వాత 'రంగస్థలం' మహేష్ అంటున్నారు. ఆ సినిమాలో రామ్ చరణ్ అసిస్టెంట్‌ గా కామెడీతో పాటు ఎమోషన్ కూడా పండించాడు మహేష్.

 

'మహానటి'లో కూడా సత్యం పాత్రలో మెప్పించాడు. విలన్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ నటించాడు మహేష్. 'మహానటి' తర్వాత కార్తికేయ హీరోగా వచ్చిన 'గుణ 369'లో నెగిటివ్ రోల్ చేసాడు. ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న మహేష్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడని తెలుస్తుంది. ఆ విష‌యాన్ని స్వ‌యంగా అతనే క‌న్ఫామ్ చేశాడు. తన దగ్గరి బంధువుల అమ్మాయి మెడ‌లో త్వ‌ర‌లో మూడు ముళ్లు వేయ‌బోతున్నాడు ఈ న‌టుడు. తాజాగా ఈయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తూర్పు గోదావరి జిల్లా నుంచి వచ్చిన మహేష్.. తన బంధువుల అమ్మాయినే పెళ్ళి చేసుకోబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. లాక్‌ డౌన్ తర్వాత పూర్తయిన వెంటనే మహేష్ పెళ్ళి ఘనంగా జరగబోతుందని తెలుస్తుంది. పెళ్లి త‌ర్వాత కూడా అత‌ని కెరీర్ మ‌రింత స‌క్సెస్ కావాల‌ని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: