అక్కినేని కుటుంబంలో నాగార్జున నాగేశ్వరరావు వారసుడిగా వచ్చారు. ఆయన తరువాత ఇద్దరు కొడుకులు లైన్లో ఉన్నారు. ఇందులో పదేళ్ళ క్రితమే నాగ చైతన్య హీరోగా వచ్చాడు. దాదాపుగా రెండు పదుల సినిమాలు చేసినా కూడా స్టార్ ఇమేజ్ మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు. అయితే ఆయన కెరీర్లో కొన్ని హిట్లు మాత్రం పడ్డాయి.

 

నాగ చైతన్య లవర్ బాయ్ క్యారక్టర్లకు సూట్ అవుతారని, రోమాంటిక్ రోల్స్ బాగా వేస్తాడని పేరు వచ్చింది. ఇది అక్కినేని ఫ్యామిలీ ఇమేజ్ ని పెంచేదే. ఇక మరో హీరో అఖిల్ ఉన్నాడు. ఇప్పటికి మూడు సినిమాలు చేశాడు. మూడూ అఖిల్ ని డిసప్పాయింట్ చేశాయి. దాంతో జనాల్లో బాగా పండే స్టోరీ అనుకుంటూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ మూవీ చేశాడు. ఈ మూవీ సమ్మర్ కి రిలీజ్ అనుకున్నాడు. నిజంగా సమ్మర్ కి వస్తే పెద్ద హిట్టే కొట్టేది.

 

అయితే ఇపుడు లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ దసరాకు వెళ్తుంది అంటున్నారు. అదే జరిగితే భారీ పోటీ ఎదుర్కోవాల్సివస్తుంది. వరసగా అనేక సినిమాలు క్యూలో ఉన్నాయి. దాంతో ఫలితం ఏమైనా తేడా కొడితే అఖిల్ కెరీర్ మళ్ళీ ఇబ్బందులో పడుతుంది. దాంతో అఖిల్ తెగ టెన్షన్ మీద ఉన్నాడట.

 

ఇక చైతూ చూస్తే ఆయన సాయి పల్లవితో నటించిన మూవీ లవ్ స్టోరీకి కూడా సమ్మర్ లాంటి వెకేషన్సే సూటబుల్. అలా అయితేనే సినిమా హిట్ అవుతుంది. కానీ లాక్ డౌన్ తో సమ్మ మొత్తం పోయింది. దాంతో ఇపుడు చైతూ కూడా వెయిట్ చేస్తున్నాడు. ఈ మూవీ హిట్ కావాలని చైతూకి ఉంది. సరైన స్లాట్ చూసుకుని రిలీజ్ కొడితే బాగా ఆడుతుంది. పోటీ వస్తే మాత్రం సాదా సీదా బొమ్మ అయిపోయింది. దాంతో చైతూ కూడా లాక్ డౌన్ తో టెన్షన్ మీద ఉన్నాడుట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: