నోరా ఫతేహి అంటే ప్రస్తుతం సౌత్ లో గాని నార్త్ లో గాని తెలియని ప్రేక్షకులుండరు. తన హిప్ మూవ్ మెంట్స్ తో కాకరేపుతుంది. ఏ సాంగ్ చేసినా నోరా నడుమొంపులతో స్క్రీన్ షేక్ చేయాల్సిందే. 2015లో విడుదలైన ఎన్టీఆర్ టెంపర్ సినిమాలో ప్రత్యేక గీతంలో నర్తించి తెలుగుతెరకు పరిచయం అయింది ఈ మొరాకో కంట్రీ బ్యూటీ.  ఆ తర్వాత బాహుబలి, కిక్ 2, ఊపిరి సినిమాలలో ప్రత్యేక గీతాలలో టాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక బాలీవుడ్ లో అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాండ్ డాన్స్ తో అదరగొట్టింది. డాన్సర్ గా, నటిగా, గాయనిగా సంచలనాలు సృష్టిస్తున్న నోరా.. ఇంస్టాగ్రామ్ లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. 

 

మొరాకో దేశస్థురాలైన నోరా ఇంస్టాగ్రామ్ లో 13 మిలియన్ల ఫాలోయర్స్ తో సెన్షేషన్ ని క్రియోట్ చేసింది. ప్రపంచంలోనే అత్యధిక ఫాలోయింగ్ కలిగిన మొరాకో సెలబ్రిటీగా నోరా పాపులారిటీని సాధించింది. ఈ సందర్భంగా నోరా "ఇంస్టాగ్రామ్ అనేది సోషల్ మీడియాలో చాలా పెద్ద నెట్వర్క్. ప్రపంచంలోనే 13మిలియన్స్ ఫాలోయింగ్ సాధించిన ఫస్ట్ మొరాకో సెలబ్రిటీగా చాలా ఆనందంగా ఉంది. ఈ గొప్ప రికార్డు సాధించడానికి కారణమైన నా అభిమానులకు స్నేహితులు నన్ను సపోర్ట్ చేస్తున్న సన్నిహితులు అందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు' తెలిపింది.  

 

ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్న నోరా ఫతేహి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. వాస్తవానికి నోరా హీరోయిన్ మెటీరియల్ అని చెప్పాలి. అందం అభినయం రెండూ తనలో ఉన్న ప్లస్ పాయింట్స్. కాని ఎందుకనో అటు బాలీవుడ్ లో గాని ఇటు టాలీవుడ్ లో గాని హీరోయిన్ గా అవకాశాలు రాలేదు. కాని ఐటం సాంగ్స్ తో మాత్రం నోరా కి ఎవరు పోటీ రాలేకపోతున్నారు. అంతగా తన డాన్స్ తో తెలుగు హిందీ భాషల్లో అదరగొడుతుంది. మరి ఇక ముందైనా నోరా కి మేకర్స్ హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. అయితే ఇప్పుడు చేస్తున్న ఐటం సాంగ్స్ తో స్టార్ హీరోయిన్ కంటే ఎక్కువే క్రేజ్ ని సాధించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: