నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా నటించిన తాజా చిత్రం ‘వి’. నివేదా థామస్, అదితి రావు హైదరీ హీరోయిన్స్ గా నటించారు. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించారు. ఇప్పటికే అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 25న ఉగాది పండగ సందర్భంగా రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా ప్రభావంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. 

 

అయితే ఈ సినిమాని జూలై లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు దిల్ రాజు. కాని పరిస్థితులు అనుకూలిస్తాయా లేదా అన్నది ఇంకా క్లారిటి లేదు. ఎప్పటికప్పుడు లాక్ డౌన్ ని పోడిగిస్తున్న నేపథ్యంలో చాలా సినిమాలు రిలీజ్ కి నోచుకోవడం లేదు. దాంతో అనుకున్న సినిమాల షెడ్యూల్స్ అన్ని తారుమారు అవుతున్నాయి. ఇక నాని కెరీర్ లో 25 వ సినిమాగా రూపొందిన ఈ సినిమాలో నాని నెగిటివ్ రోల్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

 

అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్న నాని కంటే సుధీర్ బాబు క్యారెక్టర్ హైలెట్ కానుందా అన్న చర్చలు సాగుతున్నాయట. అందుకు కారణం రీసెంట్ గా సుధీర్ బాబు పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ లో కనిపిస్తున్నాడు. ఇంతకముందు బాలీవుడ్ సినిమా భాగీ లోను సుధీర్ ఈ తరహా పాత్రతోనే బాగా పాపులర్ అయ్యాడు.

 

దాంతో నాని కంటే సుధీర్ బాబు హైలెట్ అవుతాడని అంటున్నారు. కాని విశ్వసనీయ సమాచారం ప్రకారం నాని, సుధీర్ బాబు పాత్రలు నువ్వా నేనా అన్నట్టు ఉంటాయట. పర్ఫార్మెన్స్ పరంగా ఇద్దరు బాగా ఆకట్టుకుంటారట. ఇద్దరిని సమానంగా చూపించాడట దర్శకుడు. ఇద్దరు హైలెట్ అవుతారట. అంతేకాదు హీరోయిన్స్ కి కూడా సినిమా రిలీజయ్యాక విపరీతమైన క్రేజ్ వస్తుందని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: