టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ పరంగా ఏడవ సినిమాగా 2001లో తెరకెక్కిన మూవీ ఖుషి. యువ దర్శకుడు ఎస్ జె సూర్య దర్శకత్వంలో శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ ఎమ్ రత్నం నిర్మాతగా అప్పట్లో ఎంతో భారీ ఖర్చుతో తెరకెక్కిన ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం మన తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ కూడా మరిచిపోలేదు అనే చెప్పాలి. ఈ ఖుషి సినిమా ద్వారా తొలిసారిగా పవన్ తో కలిసి వర్క్ చేసారు ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ. ఇక ఈ సినిమాకు ఆయన అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా సక్సెస్ లో అతి పెద్ద పాత్ర పోషించాయి అనే చెప్పాలి. 

IHG

అప్పటి యువత మనసులు కొల్లగొట్టిన ఈ సినిమాలోని సాంగ్స్, సీన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంతకముందు యువ నటుడు సుమంత్ హీరోగా తెరకెక్కిన యువకుడు సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయిన భూమిక చావ్లా ఈ సినిమాలో హీరోయిన్ గా తన ఆకట్టుకునే అందం అభినయంతో ప్రేక్షకుల మనసుని గెల్చుకుంది. కొన్ని అనివార్య కారణాల వలన చిన్నతనంలోనే విడిపోయిన ఒక అమ్మాయి, అబ్బాయి ఆ తరువాత పెరిగి పెద్దయ్యాక అనుకోకుండా కలవడం, ప్రేమలో పడడం, ఆపై వారి ప్రేమకథ ఏ విధంగా ముందుకు సాగింది అనే కథతో ఆసక్తికర అంశాలతో దర్శకడు సూర్య ఈ సినిమాని యూత్ పల్స్ ని పెట్టుకునేలా తెరకెక్కించడం జరిగింది. 

 

లవ్, కామెడీ, రొమాన్స్, సాంగ్స్, అదిరిపోయే ఫైట్స్, వండర్ఫుల్ విజువల్స్, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పవన్, భూమికల ఆకట్టుకునే స్క్రీన్ ప్రెజన్స్ వంటివి అప్పట్లో ఈ సినిమా ఎంతో గొప్ప విజయాన్ని అందుకునేలా చేసాయి. అయితే వాస్తవానికి ఈ సినిమా అంతకముందు 2000వ సంవత్సరంలో ఎస్ జె సూర్య దర్శకత్వంలోనే విజయ్, జ్యోతిక జంటగా తమిళ్ లో తెరకెక్కిన ఖుషికి అధికారిక రీమేక్. కాగా ఈ సినిమాని కూడా ఏ ఎమ్ రత్నం నిర్మించడం విశేషం. ఆ విధంగా అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగులో కూడా ఖుషి సినిమాలతో రెండు విజయాలు అందుకున్నారు దర్శకుడు ఎస్ జె సూర్య, నిర్మాత రత్నం. ఇక ఈ సినిమా సక్సెస్ తరువాత యువతలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ విపరీతంగా పెరగడంతో పాటు కలెక్షన్ పరంగా ఈ సినిమా మంచి సంచలనాలు నమోదు చేయడం జరిగింది......!!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: