యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ ముందుగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన దేవదాసు సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్, స్వయానా రామ్ కు పెదనాన్న అవుతారు. అయినప్పటికీ హీరోగా తొలి సినిమా నుండి తన సొంత పేరుతో నటుడిగా మంచి సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగిన రామ్, యూత్ లో అలానే అమ్మాయిల్లో మంచి రొమాంటిక్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. తన కెరీర్ లో రెడీ, కందిరీగ, పండగ చేస్కో, నేను శైలజ, ఉన్నది ఒక్కటే జిందగీ, ఇస్మార్ట్ శంకర్ వంటి పలు సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించిన రామ్, ఏ సినిమాకు ఆ సినిమా కొంత వైవిధ్యంగా చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. 

 

అయితే ఇటీవల కొన్నాళ్లుగా సక్సెస్ కోసం కొంత ఎదురు చూసిన రామ్ కు, కొన్నాళ్ల క్రితం పూరి జగన్నాథ్ తీసిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ డూపర్ హిట్ కొట్టి ఆయనకు మళ్ళి హీరోగా పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టింది .ఇక ప్రస్తుతం కిశోర్ తిరుమల దర్శకత్వంలో ముచ్చటగా మూడవసారి రామ్ నటిస్తున్న సినిమా రెడ్. వాస్తవానికి ఈ సినిమాని ఇటీవల తమిళ్ లో యువ నటుడు అరుణ్ విజయ్ హీరోగా తెరకెక్కిన తడం కు రీమేక్ గా తెరకెక్కించడం జరుగుతోంది. ఈ సినిమాలో రామ్ రెండు విభిన్న రకాల పాత్రల్లో కనపడనున్నారు. 

 

మాళవిక శర్మ, నివేత పేతురాజ్, అమృత అయ్యర్ హీరోయిన్లు గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిశోర్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వాస్తవానికి తడం సినిమా మంచి థ్రిల్లింగ్, సస్పెన్స్ జానర్ మూవీ. ఇటీవల తమిళ్ లో రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన ఆ సినిమాని కొంతవరకు మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసి దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్నారు. కాగా ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు నువ్వే నువ్వే అనే పల్లవితో సాగె సాంగ్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరి రేపు రిలీజ్ తరువాత ఈ రెడ్ సినిమా రామ్ కు ఎంతమేర సక్సెస్ ని అందిస్తుందో చూడాలి.....!!!

మరింత సమాచారం తెలుసుకోండి: