ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ చిన్న కుమారుడైన యువ నటుడు అల్లరి నరేష్, ముందుగా 2002లో వచ్చిన అల్లరి సినిమాతో హీరోగా టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. రవిబాబు దర్శకత్వంలో ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్ పై రవిబాబు, సురేష్ మూవీస్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ వారు కలిసి నిర్మించిన ఆ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ అందుకుని హీరోగా నరేష్ కు ఫస్ట్ సినిమాతోనే పేరు తెచ్చిపెట్టింది. ఇక ఆ తరువాత నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగిన నరేష్, ఆపై వాటి ద్వారా మంచి విజయాలు అందుకుని టాలీవుడ్ లో కామెడీ హీరోగా ముందుకు సాగాడు. 

IHG

ఒకానొక సమయంలో స్టార్ హీరోలతో పోల్చితే ఎంతో స్పీడ్ గా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగిన నరేష్ కు అనంతరం కెరీర్ పరంగా సరైన సక్సెస్ లు లేక కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. వాస్తవానికి ఆయనకు అవకాశాలు మాత్రం తగ్గినప్పటికీ, ఆశించిన రేంజ్ విజయం మాత్రం చాలారోజుల పాటు ఆయనతో దోబూచులాడింది. సరిగ్గా అదే సమయంలో అరుంధతి మూవీస్ బ్యానర్ పై చంద్రశేఖర్ రెడ్డి నిర్మాతగా భీమనేని శ్రీనివాసరావు నరేష్ తో తీసిన సుడిగాడు సినిమా సూపర్ హిట్ కొట్టి ఆయనకు కామెడీ హీరోగా మళ్ళి మంచి పేరు తీసుకువచ్చింది. అయితే ఆ సినిమా, అంతకముందు తమిళ్ లో సీఎస్ ఆముదన్ దర్శకత్వంలో వచ్చిన తమిళ్ పడం అనే సినిమాకు అధికారిక రీమేక్ గా తెరకెక్కడం జరిగింది. 

 

పలు హిట్ సినిమాల్లోని పేరెన్నికగన్న సన్నివేశాలను తీసుకుని వాటిని పేరడీ చేస్తూ దానిపై అల్లబడిన కామెడీ కథతో సుడిగాడు సినిమా రూపొందింది. థియేటర్ కు వచ్చిన ప్రేక్షకుడికి అప్పట్లో ఈ సినిమా ఆద్యంతం విపరీతమైన నవ్వులు పూయించింది. తన కెరీర్ పరంగా మంచి పేరుతో పాటు కలెక్షన్స్ అందుకున్న సుడిగాడు సినిమాని తాను ఎప్పటికీ మరిచిపోలేనని నరేష్ పలు సందర్భాల్లో వెల్లడించడం జరిగింది. ఆ విధముగా రీమేక్ గా తెరకెక్కిన సుడిగాడు సినిమా అల్లరి నరేష్ సుడిని అప్పట్లో కొంత మార్చింది అని చెప్పాలి....!!!  

మరింత సమాచారం తెలుసుకోండి: