టాలీవుడ్ రీమేక్ స్పెషలిస్ట్ గా వెంకటేష్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆయన రీమేక్ సినిమా చేస్తున్నాడు అంటే సినిమా హిట్ అన్నట్టే లెక్క. ఇక ఒక భాషలో హిట్టైన సినిమాలు మరో భాషలో రీమేక్ అవడం కామనే.. తెలుగులో సూపర్ హిట్ అయిన చాలా సినిమాలు మిగతా భాషల్లోకి రీమేక్ చేశారు. 2011లో బాలీవుడ్ లో వచ్చిన సినిమా బాడీగార్డ్. సిద్ధిక్ డైరెక్ట్  సినిమాలో సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటించారు.ఇక ఆ సినిమాను 2012లో రీమేక్ చేశారు వెంకటేష్. 


గోపీచంద్ మలినేని డైరక్షన్ లో ఈ రీమేక్ సినిమా తెరకెక్కింది. వెంకటేష్ సరసన త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో వెంకటేష్ నటన మెప్పిస్తుంది. ఇక త్రిష కూడా ఎప్పటిలానే అదరగొట్టింది. సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ లో సలోని నటించడం విశేషం. ఇక తెలుగు బాడీగార్డ్ కు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్. మంచి మ్యూజిక్ ఇచ్చిన థమన్ సినిమాను మ్యూజికల్ గా కూడా హిట్ అయ్యేలా చేశాడు. 


వెంకటేష్ సినిమా అంటేనే మినిమమ్ గ్యారెంటీ ఇక హిట్ సినిమా రీమేక్ అంటే ఇక్కడ ఆ రిజల్ట్ రిపీట్ అవుతుంది. వెంకటేష్ సినిమాల సెలక్షన్ కూడా అదే విధంగా ఉంటుంది. తెలుగు బాడీగార్డ్ సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మించారు. సినిమా మొత్తం కామెడీతో అలరిస్తూనే కొర్ పాయింట్ హృదయానికి టచ్ అయ్యేలా ఉంటుంది. వెంకటేష్ మంచి ఫామ్ లో ఉన్న టైం లో ఈ సినిమా చేశాడు. సినిమా వెంకీ కెరియర్ లో మంచి సక్సెస్ గా నిలిచింది. ప్రస్తుతం వెంకటేష్ తమిళ సూపర్ హిట్ మూవీ అసురన్ రీమేక్ లో నటిస్తున్నాడు. ఆ సినిమాకు టైటిల్ గా నారప్ప అని ఫిక్స్ చేశారు. సినిమాను శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: