మళయాళ సినిమా ప్రేమమ్ అక్కడ సూపర్ హిట్ కొట్టడమే కాదు అన్ని భాషల ఆడియెన్స్ మీద అది ఇంప్యాక్ట్ క్రియేట్ చేసింది. నవీన్ పౌలి హీరోగా నటించిన ఆ సినిమాను ఆల్ఫోన్స్ పుత్రెన్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాతోనే అనుపమ పరమేశ్వరన్, సాయి పల్లవి తెరంగేట్రం చేశారు. ముఖ్యంగా మలార్ పాత్రలో నటించిన సాయి పల్లవి సూపర్ క్రేజ్ దక్కించుకుంది. అప్పటికే కార్తికేయతో హిట్ అందుకున్న దర్శకుడు చందు మొండేటిరీమేక్ ఛాన్స్ ఇచ్చారు. 

 

నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ఈ రీమేక్ ఇక్కడ కూడా మంచి ఫలితాన్ని అందుకుంది. దశల వారీగా ప్రేమ గురించి చాల అద్భుతంగా చూపించాడు దర్శకుడు. చందు కూడా ఈ సినిమాతో తన టాలెంట్ చూపించాడు. నాగ చైతన్య ఈ సినిమాతో ఆల్రెడీ వచ్చిన లవర్ బోయ్ ఇమేజ్ ను ఇంకాస్త పెంచుకున్నాడని చెప్పొచ్చు. ప్రేమమ్ సినిమా కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. క్లైమాక్స్ లో నాగార్జున స్పెషల్ సర్ ప్రయిజ్ ఆడియెన్స్ కు మంచి కిక్ ఇస్తుంది.

 

సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్ కు ఇక్కడ మంచి అవకాశాలు వస్తున్నాయి. అంతేకాదు సినిమాలో నటించిన మళయాళ భామ మడోన్నాకు ఇక్కడ సూపర్ ఫాలోయింగ్ ఏర్పడ్డది. ఒరిజినల్ వర్షన్ లో మలర్ పాత్రని తెలుగులో శృతి హాసన్ చేశారు. నాగ చైతన్య కెరియర్ కు ప్రేమమ్ ఒక మంచి బూస్టప్ ఇచ్చిందని చెప్పొచ్చు. సినిమాలో చైతు నటన కూడా చాలా మెచ్యూర్డ్ గా అనిపిస్తుంది. ప్రస్తుతం చైతన్య వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్నారు. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో లవ్ స్టోరీ సినిమా చేస్తున్న చైతన్య ఆ తర్వాత విక్రమ్ కుమార్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది.          

మరింత సమాచారం తెలుసుకోండి: