రీమేక్ సినిమాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో ఆలోచన. కొంత మంది హీరోలు ఒరిజినల్‌ అయితే ఆడియన్స్‌ను ఎక్కువగా ఎంటర్‌టైన్ చేస్తదని భావిస్తే మరికొందరు మాత్రం ఆల్ రెడీ సక్సెస్‌ అయిన ఫార్ములా అయితే హిట్‌ ఈజీగా కొట్టొచ్చని భావిస్తున్నారు. ఈ రెండు కాకుండా మరో వర్గం కూడా ఉంది. రీమేక్ సినిమానే రీమేక్‌ కాదని చెప్పి ఈ సక్సెస్‌ను తమ ఖాతాలో వేసుకునే వారు. అలాంటి వారు కూడా ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అయితే ఇటీవల ఇలాంటి విమర్శలు ఎదుర్కున్న టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్.

 

పవర్‌ స్టార్ పవన కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన డిజాస్టర్ మూవీ అజ్ఞాతవాసి. ఈ సినిమా రిలీజ్ కు ముందు నుంచే భారీ స్థాయిలో వివాదాస్పద మైంది. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ ఈ సినిమాను లార్గో వించ్‌ అనే ఫ్రెంచ్‌ సినిమాకు ఫ్రీ మేక్‌గా తెరకెక్కిస్తున్నాడన్న ప్రచారం రిలీజ్ ముందు నుంచే జరిగింది. అయితే చిత్రయూనిట్‌ మాత్రం తమ సినిమా ఫ్రెష్ కథ అని చెపుతూ వచ్చారు. కానీ రిలీజ్ తరువాత సీన్ మారిపోయింది. ఫ్రెంచ్‌ సినిమాను యాజిటీజ్‌గా రీమేక్‌ చేసేసిన త్రివిక్రమ్‌ , క్రెడిట్‌ మాత్రం తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశాడు.

 

అయితే అసలు విషయం బయటకు రావటంతో ప్రేక్షకులు విమర్శలు మొదలు పెట్టారు. అంతేకాదు ఏకంగా ఒరిజినల్ సినిమా లార్గో వించ్‌ దర్శకుడు జెరోమ్ సల్లే కూడా అజ్ఞాతవాసి ఫ్రీమేక్ అంటూ ఆరోపించాడు. అంతేకాదు ఇది మేధో చౌర్యం అంటూ ఘాటుగా విమర్శించాడు. ప్రేక్షకులు కూడా ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఓ సూపర్‌ హిట్ సినిమాను యాజిటీజ్‌గా రీమేక్‌ చేసి కూడా డిజాస్టర్ అవుట్‌ పుట్‌ ఇవ్వటంతో త్రివిక్రమ్ టాలెంట్‌ మీద కూడా విమర్శలు వినిపించాయి.
IHG

మరింత సమాచారం తెలుసుకోండి: