ఒకే సినిమాను వివిధ భాషల్లో దాదాపు 16 సార్లు రీమేక్ చేయటం అంటే మామూలు విషయం కాదు. అలాంటి అరుదైన ఘనత సాధించిన అద్భుత చిత్రమే దేవదాసు. 1917లో ప్రముఖ బెంగాళీ రచయిత శరత్ చంద్ర ఛటోపాధ్యాయ రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. తొలిసారి 1928లో సైలెంట్‌ మూవీగా ఈ సినిమాను రూపొందించారు. ఆ తరువాత బెంగాళీ, హిందీ, అస్సామీ భాషల్లో రూపొందించారు. 1953లో తెలుగు, తమిళ భాషల్లో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఓ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా సౌత్ ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ క్లాసిక్‌గా నిలిచిపోయింది.

 

తెలుగు దేవదాసు ఏ స్థాయిలో సక్సెస్‌ అయ్యిందంటే. తరువాత ఆ సినిమా ఎన్ని సార్లు రీమేక్‌ అయినా అక్కినేని నటన ఎవరు మ్యాచ్ చేయలేకపోయారు ఆ నటులే స్వయంగా ఒప్పుకునే స్థాయిలో సక్సెస్‌ అయ్యింది. అక్కినేని తరువాత సూపర్‌ స్టార్ కృష్ణ కూడా దేవదాసును రీమేక్ చేశాడు. అయితే అక్కినేని సినిమాతో పోల్చి చూస్తే ఈ సినిమా టెక్నికల్ గా సూపర్బ్‌ అనిపించినా ఎమోనల్‌గా మాత్రం ఆ స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. 1955లో దిలీప్‌ కుమార్ హీరోగా హిందీలో దేవదాస్‌ను రీమేక్‌ చేశారు.

 

ఇక ఈ జనరేషన్‌కు తెలిసిన దేవదాస్‌ షారూఖ్‌ ఖాన్‌. 2002లో క్లాసిక్ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ.. షారూఖ్‌, ఐశ్వర్య రాయ్‌, మాధురి దీక్షిత్‌ ల కాంబినేషన్‌లో ఈ సినిమాను రీమేక్‌ చేశాడు. అయితే క్వాలిటీ పరంగా అద్బుతం అనిపించిన ఈ దేవదాసు, ఆ మ్యాజిక్‌ను మాత్రం రిపీట్ చేయలేకపోయింది. ఇలా దాదాపు 16 సార్లు పూర్తి స్థాయి సినిమాగా దేవదాసు రీమేక్‌ కాగా, వెబ్‌ సిరీస్‌లు, అడాప్టేషన్‌లు కలుపుకుంటూ దాదాపు 25 సార్లు దేవదాస్‌ రీమేక్‌ అయి ఉంటుందని లెక్కలు వేస్తున్నారు మేకర్స్‌..

మరింత సమాచారం తెలుసుకోండి: