టాలీవుడ్ లో కొన్ని సినిమాలు విడుదల అయినా కాకపోయినా వాటికి మంచి క్రేజ్ ఉంటుంది అనేది వాస్తవం. ఒక్క సినిమా హిట్ అయినా చాలు అనుకునే హీరోలు కూడా కొందరు ఉన్నారు. వారి సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పవన్ కళ్యాణ్ అలాంటి కోవకే వస్తారు. ఆయన సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులకు ఒకరకంగా పండగ లాంటిది అనే చెప్పుకోవచ్చు. ఆయన ప్రస్తుతం వకీల్ సాబ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు అనేది వాస్తవం. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా పింక్ రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ అనే సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో ఎన్నో చర్చలకు వేదికగా మారింది అనే చెప్పుకోవచ్చు. ఈ సినిమా ద్వారా మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వాలి అనేది పవన్ కళ్యాణ్ ప్లాన్ గా చెప్తున్నారు టాలీవుడ్ జనాలు. ఈ సినిమా తర్వాత ఇక పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయినా వచ్చే ఏడాది విడుదల అవుతుంది. ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. 

 

ఇక ఈ సినిమా దర్శకుడు కూడా ఈ సినిమాను లేట్ అయినా పర్వాలేదు గాని ఒక రేంజ్ లో అభిమానులకు చూపించాలి అని భావిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ఇంకా స్పష్టత లేదు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మరో రెండు సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమా రీమేక్ కావడం పవన్ కళ్యాణ్ కెరీర్ లో రీమేక్ సినిమాలు మంచి హిట్ అవ్వడం తో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: