టాలీవుడ్ లో యంగ్ హీరోలందరూ పెళ్ళి బాటపడుతున్నారు. హీరో నిఖిల్ ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో రోజులవుతున్నా ఇంకా పెళ్ళి మాట ఎత్తడం లేదని అనుకునేలోపే తాను ప్రేమించిన షాలినితో వివాహానికి సిద్ధమయ్యాడు. ఇక హ్యాపీడేస్ తో పరిచయమైన నిఖిల్ కూడా డా పల్లవితో కమిటయ్యాడు. తాజాగా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ లిస్ట్ లో రెండో స్థానంలో ఉన్న భళ్లాలదేవుడు రానా కూడా ఒంటరిజీవితానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు చెప్పేశాడు.

 

వెడ్డింగ్ ప్లానర్ మిహీకా బజాజ్ ని పరిచయం చేస్తూ పెళ్ళికి ఒప్పుకుందని షేర్ చేశాడు. రానా ఇంటివాడవుతుండడంతో అందరి చూపు ప్రభాస్ పైనే పడింది. ౪౦ఏళ్ళు దాటినా ఇంకా పెళి ఊసెత్తని ప్రభాస్ పై ఇప్పుడు ప్రశ్నల వర్షం కురుస్తుంది. రానా చేసుకుంటున్నాడు. ఇక నువ్వెప్పుడంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. ప్రభాస్ గురించి ఏ డిస్కషన్ వచ్చినా పెళ్ళి టాపిక్ వచ్చేసరికి ఏ సమాధానమూ వచ్చేది కాదు.

 

దాంతో సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్ళి వార్తలపై పుకార్లు షికార్లు చేసేవి. ప్రభాస్ పెళ్ళి కుదిరిందనీ, ప్రభాస్ చేసుకోబోయే అమ్మాయి ఈమెనే అంటూ హోరెత్తించారు. అయితే అవన్నీ వట్టిమాటలేనని తేలిపోయేది. రానా తన పెళ్ళి గురించి శుభవార్త చెప్పడంతో ప్రభాస్ ఎప్పుడు చెప్తారా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ పెళ్ళిపై మీమ్స్ స్టార్ట్ అయ్యాయి. రానా పెళ్ళి విషయం ఏంటోగానీ అందరూ ప్రభాస్ మీదే పడ్డారు.

 

రానా పెళ్ళి గురించి ఎప్పుడు అడిగినా ఎలాంటి సమాధానమివ్వని రానా సడెన్ గా షాక్ ఇవ్వడంతో ఇండస్ట్రీ షాక్ కి గురైంది. అయితే ప్రభాస్ కూడా ఇలాంటి షాకే ఇవ్వనున్నాడా అని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో రెండు సినిమాలున్నాయి. సినిమా  తర్వాత సినిమా వరుసగా ఒప్పేసుకుంటున్న ప్రభాస్ పెళ్ళి గురించి ఆలోచించట్లేదేమో అనిపిస్తుంది. మొన్నటి వరకుఉ రానా గురించి కూడా అలాగే అనుకున్నారు. కానీ సడెన్ గా షాకిచ్చేసరికి, ప్రభాస్ కూడా ఏదో ఓ రోజు గుడ్ న్యూస్ చెప్తాడని వెయిట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: