మాస్ మహారాజ్ రవితేజ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో వచ్చిన సినిమా భద్ర. ఈ సినిమాతోనే బోయపాటి శ్రీను దర్శకుడిగా పరిచయం అయ్యాడు. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా రవితేజ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా రిలీజై 15 ఏళ్ళు అవుతున్న సందర్భంగా సినిమా గురించి కొన్ని ఆఫ్ స్కీం విషయాలు బయటకు వచ్చాయి. బోయపాటి శ్రీను ఈ సినిమాను ముందు అల్లు అర్జున్ తో తీయాలని అనుకున్నారట. బన్నీ కూడా కథ విని నచ్చిందని చెప్పారట. 

 

అయితే అప్పటికే గంగోత్రి, ఆర్య సినిమాలు మాత్రమే చేసిన అల్లు అర్జున్ కు ఇలాంటి యాక్షన్ సినిమా సెట్ అవుతుందో లేదో అని ఆ సినిమాను వదులుకున్నాడు. బన్నీ కాదనడంతో రవితేజ లైన్ లోకి వచ్చాడు. 2005లో వచ్చిన భద్ర సినిమా రవితేజకు మంచి హిట్ ఇచ్చింది. అదే ఇయర్ లో భారీ అంచనాలతో వచ్చిన భగీరథ సినిమా నిరాశపరిచింది. భద్ర సినిమాలో రవితేజ సరసన మీరాజాస్మిన్ హీరోయిన్ గా నటించింది. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. 

 

బన్నీ చేయాల్సిన భద్ర రవితేజ చేసి హిట్ అందుకున్నాడు. అయితే సినిమా రిలీజై హిట్ అయ్యాక అల్లు అర్జున్ మంచి ఛాన్స్ మిస్ అయ్యానని భావించి ఉండొచ్చు. ఆలా బోయపాటి శ్రీను మూవీ ఛాన్స్ ఒకసారి మిస్సైన అల్లు అర్జున్ సరైనోడుతో కలిసి పనిచేశారు. బన్నీ మాస్ ఫాలోయింగ్ పెంచడంలో ఆ సినిమా బాగా ఉపయోగపడ్డది. ఆ సినిమాలో బన్నీ నటనకు మెగా అల్లు ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. సరైనోడుతో అల్లు అర్జున్ కు మాస్ ఫాలోయింగ్ పెంచడంలో బోయపాటి శ్రీను సక్సెస్ అయ్యారు.        

 

మరింత సమాచారం తెలుసుకోండి: