మన తెలుగులో ఎక్కువగా తమిళ సినిమాలను రీమేక్ చేస్తూ ఉంటారు. అక్కడ మంచి విజయాలు సాధించిన సినిమాలను ఇక్కడికి తీసుకొచ్చి ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందించే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇలా వచ్చిన సినిమాలు చాలా వరకు విజయవంతం అయ్యాయి అనే చెప్పాలి. అందులో ప్రధానంగా పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన కొన్ని సినిమాలు అయితే ప్రేక్షకులకు బాగా బాగా నచ్చాయి అనేది వాస్తవం. పవన్ కళ్యాణ్ చేసిన ఖుషీ సినిమా తమిళ్ రీమేక్ సినిమా నుంచి వచ్చిన సినిమానే కావడం విశేషం. 

 

ఆయన కెరీర్ లో ఆ సినిమా సూపర్ హిట్ అయింది అనే చెప్పుకోవచ్చు. ఆ సినిమాతోనే పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా మారిపోయారు. ఆయన తో సినిమాలు చేయడానికి గానూ టాలీవుడ్ లో అగ్ర దర్శకులు అక్కడి నుంచి ఎక్కువగా పోటీ పడిన సందర్భాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కి అక్కడి నుంచి యూత్ లో బాగా క్రేజ్ పెరిగింది అనేది కూడా వాస్తవం. ఆయన అక్కడి నుంచి వెనక్కు తిరిగి చూసుకునే అవసరం రాలేదు. తమిళ సినిమా ఖుషీ రీమేక్ గానే ఈ సినిమాను తీసుకొచ్చారు. అక్కడ ఆ సినిమా సూపర్ హిట్ అయింది కూడా. 

 

దీనితోనే పవన్ కళ్యాణ్సినిమా మీద ఎక్కువగా ఆసక్తి చూపించారు. ఏది ఎలా ఉన్నా సరే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటన సహా హీరోయిన్ తో నడిపిన ప్రేమాయణం, సినిమాలో ఉండే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను బాగా బాగా ఆకట్టుకున్నాయి అనేది వాస్తవ౦. టాలీవుడ్ లో ఇక్కడి నుంచే రీమేక్ సినిమాలకు ఆదరణ ఏది ఎకువగా పెరిగింది. రీమేక్ సినిమాలను తీయడానికి ఇక్కడి దర్శక నిర్మాతలు ఇక్కడి నుంచే ఎక్కువగా ఆసక్తి చూపించారు కూడా. కాని చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: