చాలా కాలం నుంచి పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల సైతం రీమేక్ క‌థ‌ల‌నే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతున్నారు. క‌థ క‌థ‌నాలు బావుండి ఆ చిత్రం హిట్ అయితే చాలు మ‌న తెలుగు హీరో ఆ రైట్స్‌ని సొంతం చేసుకుని సినిమా చేసేయాల‌ని చూస్తున్నారు. ఇక ఆ చిత్రం ఇక్క‌డ కూడా హిట్ అయితే ఇక కాసుల వ‌ర్ష‌మే కాస్త అటూ ఇటూ అయినా బెడిసికొట్ట‌డ‌మే ఇదంతా సినీ ఇండ‌స్ట్రీలో మామూలే ఇక ఈ విష‌యం ప‌క్క‌న పెడితే  సినిమాకూ వ్యాపారమే సూత్రమైనపుడు -రీమేక్‌లతో వచ్చే లాభాలను ఎందుకు వదులుకోవాలి? అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీ నుంచి వినిపిస్తోన్న మాట. నిజమే ఈ మ‌ధ్య కాలంలో వచ్చిన అనేక అనువాద సినిమాలు బాగానే డబ్బుచేశాయి. సినిమావర్గాలకు సిరులే కురిపించాయి. కానీ -అచ్చమైన తెలుగు కథకు ఆడియన్స్‌ని దూరం చేస్తున్నాయన్న నష్టాన్ని కూడా ఇక్క‌డ గ‌మ‌నించాల్సి ఉంది. 

 

కాక‌పోతే నిర్మాత‌లు అది గమనించక పోవడం దురదృష్టకరం. ఒకవిధంగా చెప్పాలంటే -మన సంస్కృతి నుంచి ఆడియన్స్‌నే దూరం చేస్తున్నాయన్నది కాదనలేని వాస్తవం. ఇటీవల వచ్చిన కొన్ని అనువాద చిత్రాలనే తీసుకుందాం. నిన్నటికి నిన్న తమిళ మాతృత కథతో చిరంజీవి చేసిన ఖైదీ నెంబర్ 150, రామ్‌చరణ్ చేసిన ధ్రువ, కొంచెం ముందు ఫ్రెంచ్ సినిమా మాతృకతో నాగార్జున చేసిన ఊపిరి, మళయాలం మాతృక కథతో చైతూ చేసిన ప్రేమమ్‌లాంటి చిత్రాలన్నీ ఆడియన్స్ మెప్పు పొందినవే. ఆర్థికంగా అనుకున్న స్థాయికి చేరుకున్నాయా? అన్న మాటను పక్కనపెడితే -ఒకసారి చూసి ఆడియన్స్ ఓకే అనేశారు. అంతకుముందు సీజన్‌లో -దృశ్యం, గబ్బర్‌సింగ్, గోపాల గోపాల లాంటి చిత్రాలూ మంచి రేటింగ్‌నే సాధించాయి. 

 

ఇక ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యానికి వ‌స్తే ఎక్కువ‌గా రీమేక్ చిత్రాల‌కే ఆయ‌న ఇంట్ర‌స్ట్ చూపిస్తారు. ఆయ‌న న‌టించిన చిత్రాల్లో దాదాపు ఎక్కువ‌గా రీమేక్‌లే ఉన్నాయ‌ని చెప్పాలి. గోకులంలో సీత, సుస్వాగతం, తమ్ముడు, ఖుషి, అన్నవరం, తీన్‌మార్, గబ్బర్‌సింగ్, గోపాలగోపాల.. కాటమరాయుడు.  కాటమరాయుడు వసూళ్లపరంగా పెద్దలెక్కలే చెబుతున్నా -కామన్ ఆడియన్స్ మాత్రం పెదవి విరుస్తుండటాన్ని గ్రహించాలి. ఇక తాజాగా ఆయ‌న న‌టిస్తున్న పింక్ చిత్రం వ‌కీల్‌సాబ్ కూడా రీమేక్ చిత్ర‌మే అని చెప్పాలి.  ఇక ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన దాదాపు అన్ని రీమేక్ చిత్రాలు కాస్త హిట్ అయిన‌ప్ప‌టికీ తీన్‌మార్ ఒక్క‌టే కొంచం క‌లెక్ష‌న్ల ప‌రంగా కొంత వెన‌క‌బ‌డింది. పవన్ 'తీన్‌మార్' సినిమాలోని అర్జున్ పాల్వాయ్ పాత్ర మొత్తం కాశీ బ్యాక్ డ్రాప్ లోనే సాగుతుంది. కానీ ఈ హిందీ రీమేక్ మూవీ పవన్‌కు హిట్‌ను అందివ్వలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: