అక్కినేని సమంత.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ అమ్మాయి. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైంది. అక్కినేని ఇంటి కోడలైన తర్వాత ఈమె కెరీర్ మూడు హిట్లు.. ఆరు సినిమాలన్నట్టుగా సాగిపోతుంది. ఒకవైపు వైవాహిక జీవితాన్ని ఇంకోవైపు సినీ జీవితాన్ని బ్యాలెన్స్ చేసే విధానం చూసి మిగతా ఇండస్ట్రీ జనాలు ఆశ్చర్యపోతున్నారు. సమంత ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్‌లో ఒకరుగా వెలుగుతోంది. ఇటీవల ఈ భామ ఒక ఇంగ్లీష్ పత్రిక నిర్వహించే పోల్‌లో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019 టైటిల్‌ను కైవసం చేసుకుంది.

 

గతేడాది 'ఓ బేబీ' సినిమాతో మాయ చేసింది. ఆమె ఓ ప్రయోగాత్మక పాత్రలో అబ్బురపరిచింది. భారీ విజయం అందుకున్న ఆ చిత్రం డైరెక్టర్ నందిని రెడ్డి కి చాలా కాలం తరువాత మంచి హిట్ అందించింది. ఇక యూఎస్ లో వన్ మిలియన్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఆ ఫీట్ సాధించిన ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీగా నిలిచింది. నాగసౌర్య, రాజేంద్రప్రసాద్, లక్ష్మీ, రావు రమేష్, జగపతిబాబు, హేమంత్ ప్రధాన పాత్రలు పోషించారు. అక్కినేని నాగ చైతన్య కూడా ఒక సీన్ లో కనిపించాడు. కాగా సమంతసినిమా నుండి ఓ ఫోటోని పంచుకున్నారు. సీనియర్ నటి లక్ష్మీ తో పాటు సమంత ఉన్న ఆ ఫోటోని షేర్ చేసి ఆ సినిమా షూటింగ్ జ్ఞాపకాలను పంచుకుంది. ఈ సినిమా ఇప్పటి వరకు చూడని వారు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ నెట్ ప్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది చూడమని కోరింది.

 

 

ఇక ఈ ఏడాది సమంత నటించిన జాను ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ‘జాను’ విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం ఆశించినతగా రాలేదనే చెప్పాలి. అయితే నటిగా సమంతకు మంచి మార్కులే పడ్డాయి. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే 'ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్‌ లో సమంత కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ లో సామ్ నెగిటివ్ రోల్ లో కనిపించనున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: