తెలుగు హీరోల సినిమాలను కోట్లమంది చూస్తున్నారు నార్త్ లో.. యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన తక్కువ టైమ్ లోనే ఫ్యూవర్ షిప్స్ మిలియన్స్ దాటిపోతోంది. ఆమధ్య ఇస్మార్ట్ శంకర్.. డియర్ కామ్రేడ్.. ఇప్పుడు నితిన్ సినిమాలకు కూడా డిమాండ్ పెరిగిపోయింది. తెలుగులో రిలీజ్ అయిన చాలా సినిమాలు.. ఆ తరువాత హిందీలో డబ్ అయ్యి.. యూట్యూబ్ లో అప్ లోడ్ అవుతుంటాయి . ఈ మధ్య తెలుగు నుంచి హిందీ డబ్ అయిన సినిమాలను విపరీతంగా చూస్తున్నారు బాలీవుడ్ జనాలు. రీసెంట్ గా నితిన్ నాలుగు సినిమాలు తక్కువ టైమ్ లోనే 500 విలియన్ ఫ్యూస్ అంటే దాదాపు 50 కోట్ల పైగాప్యూవర్ షిప్ ను సాధించాయి.

 

త్రివిక్రమ్ డైరెక్షన్ సూపర్ హిట్ అయిన అ ఆ మూవీ  హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తే.. చాలా తక్కువ టైమ్ లో  దాదాపు 20 కోట్ల ఫ్యూవర్ షిప్ ను సాధించింది. పెద్ద పెద్ధ సినిమాలకు కూడా ఇంత ఫ్యూవర్ షిప్ లేదక్కడ. అంతే కాదు టాలీవుడ్ డిజాస్టర్ అయిన నితిన్ సినిమాలకు కూడా అక్కడ జనాలు విపరీతంగా చూస్తున్నారు. పెళ్లి గురించి క్లాస్ పీకడం తప్ప ఏమిలేదనిపించుకున్న శ్రీనివాస్ కల్యాణం మూవీ అప్ లోడ్ అయిన 7 నెలల్లో దాదాపు 10 కోట్ల మంది చూశారు.

 

తెలుగులో నితిన్ ను ఇమేజ్ ఏమాత్రం పెంచలేకపోయిన ఛాల్ మోహన రంగా సినిమా కూడా దాదాపు 13 కోట్ల మంది హిందీ ఆడియన్స్ చూశారు. నితిన్ కెరీర్ లో ఎక్స్ పెర్ మెంటల్ మూవీ లై కూడా హిందీలో డబ్ అయ్యి.. దాదాపు 10 కోట్లు ఫ్యూవర్ షిప్ ను దాటేసింది. టోటల్ గా నితిన్ నాలుగు సినిమాలు దాదాపు 50 కోట్ల ఫ్యూవర్ షిప్ తో హిందీలోదూసుకుపోతున్నాయి.

 

సూపర్ స్టార్ల సినిమాలు సొంత భాషలోనే ఇంత ప్యూవర్ షిప్ సాధించడానికి సంవత్సరాలకు పైగా టైమ్ పడుతుంటే.. కుర్ర హీరో నితిన్ అదికూడా హిందీలో ఈ మార్క్ ను అవలీలగా దాటేశాడు. నితిన్ నాలుగు సినిమాలే కాదు.. అంతకు ముందు విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్... రామ్-పూరీ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాలు కూడా హిందీ డబ్బింగ్ వర్షన్ లో.. యూట్యూబ్ లో కోట్లలో ఫ్యూవర్ షిప్ ను సాధిస్తున్నాయి. ఇలా తెలుగు హీరోల సనిమాలు ఇక్కడ ఫ్లాప్ అయినా బాలీవుడ్ వాళ్లకి మాత్రం బాగా కనెక్ట్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో మంచి హిట్స్ సాధిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: